అమ్మ కోసం 24 గంటలు ముళ్ల పాన్పు మీద ప్రార్థన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆమె అభిమానులు పలు విధాలుగా దేవుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. కొందరు సాహసం చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
జయలలిత ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు, అన్నాడీఎంకే నాయకులు సరైన వివరాలు వెల్లడించడం లేదని కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లండన్, సింగపూర్ నుంచి ప్రత్యేక వైద్యులు చెన్నై వచ్చారని తెలుసుకున్న అభిమానులు ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.
అమ్మ ఆరోగ్యం కుదటపడాలని ప్రత్యేక హోమాలు, పూజలు చేస్తున్నారు. తమిళనాడులోని మదురైకి చెందిన ఇరులంది (68) అనే ఆయన అమ్మ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రత్యేకంగా ఆయనే ఓముళ్ల పాన్పును తయారు చేసుకున్నారు. ఐదు రకాల ముళ్లతో ఆ పడక తయారు చేసుకున్నారు. అందులో విషపూరిత ముళ్లు ఉన్నాయి. ఆ ముళ్ల పాన్పు మీద 24 గంటల పాటు పడుకుని అమ్మ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు.
తాను నిత్యం ఆరాధించే పెచ్చియమ్మన్ దేవతకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసి అమ్మ త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఇరులందికి ఉన్న అమ్మ భక్తిని గుర్తించి ప్రశంసించారు.












Click it and Unblock the Notifications