Girlfriend: భర్తను వదిలేసింది, రూ. లక్షలు ఇచ్చేశాడు, ప్రియురాలి హత్యకు మిక్సీ బాంబు !

బెంగళూరు/హాసన్: మిక్సి పేలుడు కేసు ఊహించని మలుపు తిరిగింది. విడాకుల తరువాత ఒంటరిగా ఉంటున్న అందమైన లేడీని ప్రేమించి ఆమెతో ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకుంటుందని నమ్మి ఆమెకు లక్షల రూపాయలు ఇచ్చేశాడు. ఆమె ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. మోసం చేసిన ప్రియరాలిని చంపడానికి మాజీ బాయ్ ఫ్రెండ్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా మిక్సిలో డిటోనేటర్లు పెట్టి ఆమెకు పంపించిందని వెలుగు చూడటం కలకలం రేపింది. ప్రియురాలి దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ప్రియురాలు, ఆమె ప్రియుడు గొడవలకు మిక్సీ పేలిపోయి కోరియర్ షాప్ ఓనర్ బలి అయ్యాడని పోలీసులు అంటున్నారు.

 భర్తకు విడాకులు

భర్తకు విడాకులు

కర్ణాటకలోని హాసన్‌లోని కువెంపునగర్‌ కొరియర్‌ సెంటర్‌లో జరిగిన మిక్సీ పేలుడు కేసులో పెద్ద ట్విస్ట్‌ వచ్చింది. ఇది ఉగ్రవాద చర్య కాదని, ఓ కిలాడీ లేడీ ప్లాన్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇది ఓ జంట పెళ్లి కోరిక. మోసానికి సంబంధించిన కథ అని పోలీసుల విచారణలో తెలిసింది. భర్తతో విడాకులు తీసుకున్న తరువాత హసన్ నివాసం ఉంటున్న వసంత తన ఫోటోను మ్యాట్రిమోనీలో అప్‌లోడ్ చేసింది. బెంగళూరుకు చెందిన అనూప్ అనే వ్యక్తి వసంత ఫోటోలు, ఆమె అందం చూసి ఆమె ప్రేమలో పడ్డాడు.

 పెళ్లి చేసుకుందాం రా !

పెళ్లి చేసుకుందాం రా !

అనూప్ పెళ్లి ప్రపోజల్ కి అంగీకరించడంతో వసంత అతనితో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేసింది. అనుప్‌ అతని ప్రియురాలు వసంత మీద నమ్మకం పెట్టుకుని ఆమెకు ఇంతకాలం లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. ఇటీవల ప్రేమించిన అనూప్‌కు హ్యాండ్ ఇచ్చిన వసంత డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, పెళ్లి కూడా సిద్దం కాకపోవడంతో అనూప అసహనం వ్యక్తం చేశాడు. దీంతో అనూప్ తీవ్ర నిరాశకు లోనయ్యాడని, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే నా డబ్బులు తిరిగి ఇవ్వాలని వసంతకు గట్టిగా చెప్పాడు. ఈ మధ్య ఒకటిరెండు సార్లు హాసన్‌కు వెళ్లిన అనూప్ కిలాడీ లేడీ వసంత ఇంటి ముందు వీరంగం సృష్టించాడు.

 రచ్చ చేసిన ప్రియురాలు, కోపంతో ప్రియుడు ?

రచ్చ చేసిన ప్రియురాలు, కోపంతో ప్రియుడు ?

తరువాత వసంత ఆమె ప్రియుడు అనూప్‌ మీద పోలీసులకు, రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసినందుకు వసంత మీద కోపోద్రిక్తుడైన ప్రియురాలిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ముందుగా చీర, ఆ తర్వాత సీరియల్ సెట్ పార్శిల్ వసంతకు పంపాడు. చీరను వెనక్కి పంపిన వసంత వెంటనే ప్రియుడు అనూప్‌కు ఫోన్ చేసి బూతులు తిట్టింది. అయితే అనూప్ మూడోసారి మిక్సీలో డిటోనేటర్ అమర్చి, తనను మోసం చేసిన వసంతను చంపడానికి ప్లాన్ వేశాడు. అనూప్ డీటీడీసీ కొరియర్ ద్వారా మిక్సి బాంబును వసంతకు పార్శిల్‌ పంపాడు.

 తిరిగి ఇచ్చేసిన వసంత

తిరిగి ఇచ్చేసిన వసంత

కొరియర్ ద్వారా వచ్చిన మిక్సీని డిసెంబర్ 17న కొరియర్ సెంటర్ యజమాని శశి డెలవేరి బాయ్ తో వసంతకు డెలివరీ చేశారు. మూడోసారి పంపిన పార్శిల్ తెరిచి చూడగా అది మిక్సీ అని తెలుసుకున్న వసంత ఇది నాకు వద్దు అనుకుని తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ 26న తేదీన వసంత కొరియర్ షాపులో మిక్సీ తిరిగి ఇచ్చింది. కొరియర్ పూర్తి చిరునామా అందుబాటులో లేకపోవడంతో తిరిగి పంపేందుకు 350 రుసుము చెల్లించాలని కొరియర్ సెంటర్ యజమాని శశి వసంతాకు చెప్పాడు. నా దగ్గర అంత డబ్బు లేదు, మిక్సీ పార్శిల్ ను మీరే ఏదో ఒకటి చేయమని చెప్పి మిక్సీ అక్కడే ఇచ్చిన వసంత ఇంటికి వెళ్లిపోయింది.

 పిచ్చి ప్రేమికుడి స్కెచ్ తో ?

పిచ్చి ప్రేమికుడి స్కెచ్ తో ?

మిక్సీని వెనక్కి పంపేందుకు సరైన అడ్రస్ లేకపోవడంతో కొరియర్ షాపు యజమాని శశి దాన్ని తెరిచి చెక్ చేయ్యాలని చూశాడు. ఈ సమయంలో బాంబు అమర్చిన మిక్సీ పేలిపోయి కోరియర్ షాపు యజమాని శశికి తీవ్రగాయాలయ్యాయి. మిక్సీ పేలుడు తర్వాత అనేక సందేహాలు సృష్టించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం, అంతర్గత భద్రతా విభాగం అధికారుల బృందం నమూనా సేకరణ మరియు తనిఖీలను కూడా నిర్వహించింది. హసన్ ఎస్పీ హరిరామ్ శంకర్ నేతృత్వంలోని బృందం అనేక కోణాల్లో విచారణ చేశారు. తరువాత అనూప్, వసంతల మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. .కొరియర్‌ మిక్సీ బాంబు పంపించి ప్రియురాలు వసంతను హత్య చేసేందుకు ప్రయత్నించిన ప్రేమికుడె అనూప్ ను, అతని ప్రియురాలు వసంతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+