ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ టార్చర్, అనంతపురం లేడీ టెక్కీ చేసిన పనితో !
బెంగళూరు/ అనంతపురం: ఓ అందమైన యువతి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. అనుకున్నట్లు చదువు పూర్తి చేసుకుని ఐటీ హబ్ లో బీటెక్ చదివింది. ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాధించిన యువతి మంచి జీతం తీసుకుంటున్నది. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో ఒకేసారి తిరుగుతున్న అనంతపురం జిల్లా అమ్మాయి జీవితం ముగిసిపోయింది.
ఇద్దరు ప్రేమికుల వేధింపులతో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన లేడీ టెక్కీ నదిలో దూకింది. ఇద్దరు ప్రేమికులు టార్చర్ పెట్టడం వలనే లేడీ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాకటలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలోని బాగేపల్లిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరానికి చెందిన నిహారిక (22) అనే యువతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందని చిక్కబళ్లాపురం పోలీసులు తెలిపారు.

నిహారిక ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. బీటెక్ పూర్తి చేసిన నిహారిక బెంగళూరులోని ఓప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించింది. మంచి ఉద్యోగం చేస్తున్న నిహారిక సంతోషంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు అనుకున్నారు. ఇన్ని రోజులు నిహారిక తనకు ఎలాంటి సమస్యలు లేవని కుటుంబ సభ్యులకు చెబుతూనే వచ్చిందని తెలిసింది.
గత శనివారం నిహారిక చిత్రావతి నదిలో దూకిన నిహారిక ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సమయంలో వంశీదర్ అనే యువకుడిని నిహారిక ప్రేమించింది. దీని తరువాత నిహారిక, వంశీధర్ హ్యాపీగా బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో తిరిగారని తెలిసింది. ప్రియుడితో హ్యాపీగా ఉన్న నిహారికకు ఇన్‌స్టాగ్రామ్‌లో అజయ్ అనే యువకుడు పరిచయం కావడంతో అక్కడ అసలు కథ మలుపుతిరిగింది.

వంశిధర్ ను ప్రేమించి అతనితో తిరుగుతున్న నిహారిక సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్ అజయ్‌తో కూడా ప్రేమలో పడిపోయింది. అజయ్, వంశీధర్ కు క్లాష్ కాకుండా చూసుకున్న నిహారిక ఇద్దరు ప్రియులతో కలిసి మాట్లాడుతోంది.
కొద్ది రోజుల క్రితం నిహారిక ఇద్దరు యువకులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడ తేడా కొట్టింది.
నిహారిక మనల్ని మోసం చేస్తోందని ఆమె ఇద్దరు ప్రియులు రగిలిపోయారని తెలిసింది. ఇద్దరు యువకులు తమ వద్ద ఉన్న ఫొటోలను మీ కుటుంబ సభ్యులకు చూపిస్తామంటూ నిహారికను బ్లాక్ మెయిల్ చేశారు. దానికితోడు ప్రతిరోజూ నిహారికకు ఫోన్లు చేసి ఆమెను చిత్రహింసలు పెట్టారని తెలిసింది. ఇద్దరు ప్రియులు టార్చర్ తట్టుకోలేక నిహారిక చాలా ఆవేదన చెందిందని తెలిసింది దీంతో విసిగిపోయిన నిహారిక ధర్మవరంలోని ఇంటికి వస్తానని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది.

బెంగళూరులో పని ముగించుకుని ఇంటికి వస్తానని నిహారిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషించారు. శనివారం నిహారిక బెంగుళూరు నుంచి ధర్మవరం బస్సులో బయలుదేరింది. మార్గం మధ్యలో నిహారిక కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేసింది. బెంగళూరు నుంచి బయలుదేరి నాలుగు రోజులు గడిచినా నిహారిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురై ఆమె కోసం వెతికారు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బాగేపల్లిలోని చిత్రావతి నది సమీపంలో యువతి మృతదేహం లభ్యం అయ్యింది. పోలీసుల విచారణలో ఆ శవం నిహారిక మృతదేహంగా తేలింది. బాగేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇద్దరు ప్రియులు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఓ యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సోషల్ మీడియా స్నేహాలతో గుడ్డిగా నమ్మితే లేనిపోని సమస్యలు వస్తాయని, యువతి, యువకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మనవి చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications