వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఆఫ్‌లైన్‌లో రిలయన్స్ ఫీచర్‌పోన్ బుకింగ్స్ ప్రారంభం?

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ ఫీచర్‌ ఫోన్ కోసం పది రోజుల ముందే ఆఫ్‌లైన్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. ఆఫ్‌లైన్‌లో తమ డాక్యుమెంట్లను సమర్పించి ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని రిటైలర్లు చెబుతున్నట్టు ఆ మీడియా వార్తకథనాన్ని ప్రచురించింది.

రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్స్ ను ఈ నెల 24వ, తేది నుండి ప్రారంభించనున్నట్టు ముఖేష్ అంబానీ ఇదివరకే ప్రకటించారు. కానీ ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని కొంతమంది ఆఫ్‌లైన్ రిటైలర్లు పది రోజుల ముందే ఈ ఫోన్ ఫ్రీ ఆర్డర్లను ప్రారంభించినట్టుగా ఓ మీడియా రిపోర్ట్ చేసింది.

శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్స్ ప్రారంభంశుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్స్ ప్రారంభం

ఈ ఫోన్‌ను వినియోగదారుల చేతికి ఇచ్చే సమయంలో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ను ఇవ్వాల్సిందేనని రిటైలర్లు చెబుతున్నట్టుగా ఆ పత్రిక కథనం తెలుపుతోంది. ఈ ఫోన్లను సెప్టెంబర్ 1వ,తేది నుండి మార్కెట్లోకి విడుదల చేయాలని రిలయన్స్ నిర్ణయం తీసుకొంది.

ఫ్రీ ఆర్డర్ చేసుకొనే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని ఆ కథనం ప్రకారంగా తెలుస్తోంది.

ఆధార్ నెంబర్ ఆధారంగా ఫోన్ బుకింగ్స్

ఆధార్ నెంబర్ ఆధారంగా ఫోన్ బుకింగ్స్

జియో ఫీచర్‌పోన్‌ను బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. ఆధార్‌కార్డును జియో రిటైలర్ వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో ఆధార్‌కార్డుతో ఒక్కో ఫోన్ మాత్రమే బుక్ చేసుకొనే వెసులుబాటు లభించింది.

టోకెన్ నెంబర్ ఇవ్వనున్న రిలయన్స్

టోకెన్ నెంబర్ ఇవ్వనున్న రిలయన్స్

ఫీచర్‌ఫోన్‌ను బుక్ చేసుకొంటే టోకెన్ నెంబర్‌ను అందించనున్నారు. ఈ టోకెన్ నెంబర్‌ను ఫోన్ డెలీవరి చేసే ముందుకు రిలయన్స్ కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే రిలయన్స్ స్టోర్లలో సమర్పించే ఆధార్ వివరాలన్నీ సెంట్రల్ కార్యాలయంలో నమోదౌతాయి.

మై జియో యాప్ ద్వారా ఆగష్టు 24 నుండి బుకింగ్స్

మై జియో యాప్ ద్వారా ఆగష్టు 24 నుండి బుకింగ్స్

ఆన్‌లైన్‌లో ఈ నెల 24వ, తేది నుండి ఫీచర్‌ఫోన్ కోసం బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే తొలుత ఎవరు బుక్ చేసుకొంటారో వారికే తొలుత ఈ ఫోన్లను డెలీవరి చేయనున్నట్టు రిలయన్స్ ఇదివరకే ప్రకటించింది.సెప్టెంబర్ 1 నుండి 4వ, తేదిల మధ్య ఫోన్లను డెలీవరి చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే డిమాండ్ పెరిగితే ఫోన్ల డెలీవరి మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు.

సెప్టెంబర్ 1 నుండి ఫోన్ల డెలీవరి

సెప్టెంబర్ 1 నుండి ఫోన్ల డెలీవరి

సెప్టెంబర్ 1వ, తేది నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్లు డెలీవరి కానున్నాయి. ప్రతి వారానికి సుమారు 50 లక్షల ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
Just like this time last year, the next version of Android, Android O, is in its developer preview phase and the final build is set to release soon. Now, two reliable sources claim that the new Android version is going to be rolled out on August 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X