బందరు టెక్కీ హత్య: ప్రభుత్వంపై పూజాభట్ నిప్పులు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆంధ్రప్రదేశ్‌లోని బందరుకు చెందిన టెక్కీ అనూహ్య సంఘటనపై ప్రభుత్వం తీరును నటి, దర్శకురాలు పూజాభట్ తప్పు పట్టారు. ప్రభుత్వ యంత్రాంగంపై నిప్పులు కురిపించారు. తమను రక్షించడానికే ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని, ఆ పనిచేస్తున్నారా అని అడగాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

Anger over TCS techie's death, cops suspect rape and murder

జనవరి 4వ తేదీన ముంబైలో అదృశ్యమైన మచిలీపట్నం టెక్కీ అనూహ్య మృతదేహం 16వ తేదీన కనిపించిన విషయం తెలిసిందే. బందరు నుంచి ముంబైకి బయలుదేరిన అనూహ్య సోలాపూర్‌కు చేరుకున్న తర్వాత చివరి సారి తన కుటుంబ సభ్యులతో మాట్లాడింది.

అనూహ్యపై అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ కేసు ఛేదించడంలో పోలీసులు ఇప్పటి వరకు ఏ విధమైన ప్రగతి సాధించలేకపోయారు. ముంబైలో మనం అనాథల్లా మిగిలామని అనూహ్య అంకుల్ అంటున్నారు.

ఈ స్థితిలో రాజకీయేతర సంస్థ బొంబాయి కాథలిక్ సభ పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రదర్శన చేయాలని నిర్ణయించింది. కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద మద్యం సేవించిన ఆటో రిక్షా డ్రైవర్లపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+