మోడీ పిలుపు: గ్యాస్ సబ్సిడీ వదులుకున్న అనిల్, ఉద్యోగులకు సూచన
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ వంట గ్యాస్ సబ్సిడీని వదిలేసుకున్నారు. తమ గ్రూపు కంపెనీల్లో పనిచేస్తున్న లక్ష మంది ఉద్యోగులు కూడా అదే బాటలో నడవాలని ఆయన సూచించారు.
కాగా, ఇతర పారిశ్రామిక దిగ్గజాలైన ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, అనిల్ అగర్వాల్, గౌతమ్ అదానీ, ఉదయ్ కోటక్, కిశోర్ బియానీ కూడా వంటగ్యాస్ సబ్సిడీ వద్దని ఇప్పటికే లేఖలు ఇచ్చారు.

'ప్రధాని చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, రిలయన్స్ గ్రూపు యాజమాన్య బృందం ఇప్పటికే ఎల్‌పీజీ సబ్సిడీని వదిలేసుకుంది' అని అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూపు(అడాగ్) తన ఉద్యోగులకు మంగళవారం రాసిన లేఖలో పేర్కొంది.
ఉద్యోగులు సైతం మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్లను కొనాలని అడాగ్ విజ్ఞప్తి చేసింది. కాగా, ఇప్పటికే పలువురు కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ఎంపీలు.. తదితరులు కలిసి మూడు లక్షల మందికి పైగా సబ్సిడీని వదిలేసుకున్నారు.












Click it and Unblock the Notifications