బురారీ సూసైడ్ కేసు: లలిత్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది ఎవరో తెలుసా..?
ఢిల్లీలోని బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ 11 మందిని ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది తానేనంటూ గీతామా అనే మంత్రసాని ముందుకొచ్చింది. ఆమె
మాట్లాడిన మాటలను ఓ జాతీయ ఛానెల్ టెలికాస్ట్ చేసింది. చుందావత్ కుటుంబం ఎలా ఆత్మహత్యకు పాల్పడాలో... వారి జీవితాలను ఎలా అంతమొందించుకోవాలో సూచించినట్లు ఆమె చెప్తున్నట్లు వీడియోలో ఉంది.
అయితే ఈ గీతామా అనే మంత్రసాని చుందావత్ కుటుంబానికి చెందిన ఇళ్లు కట్టిన కాంట్రాక్టర్ కూతురుగా గుర్తించడం జరిగిందని ఆ జాతీయ ఛానెల్ పేర్కొంది. అయితే అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఆమెను విచారణ చేసిన తర్వాతే ఒక ప్రకటన వచ్చే అవకాశముంది.

బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్యలు జూలై 1 ఉదయం వెలుగు చూసింది. అయితే వారి ఆత్మహత్యలకు కారణం మూఢనమ్మకమే అని విచారణ సంస్థలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఆ తర్వాత కొన్ని డైరీలు, సీసీ ఫుటేజీల ఆధారంగా వారి ఆత్మహత్యలు చాలా ప్రణాళికబద్దంగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరు చనిపోయే సమయానికి లలిత్ తండ్రి ఆత్మ వచ్చి వారిని కాపాడుతుందనే భ్రమలో వారు ఉరివేసుకున్నారు కానీ... నిజంగా వారికి మృతిచెందే ఆలోచన లేదన్నారు.












Click it and Unblock the Notifications