పెను ప్రమాదంలో తాజ్ మహల్..?
దేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిల్లో తాజ్ మహల్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రేమకు చిహ్నంగా భారతీయులు ఈ కట్టడాన్ని భావిస్తారు. సుమారు 373 ఏళ్ల క్రితం ఈ అద్భుతమైన ఆకారాన్ని నిర్మించారు. అప్పటి నుంచి చెక్కుచెదరకుండా కోట్ల మంది పర్యాటకులకు కన్నుల విందును అందిస్తోంది. అయితే తాజాగా ఈ కట్టడంలో పగుళ్లు ఏర్పడినట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రపంచంలోనే ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటిగా పేరుపొందింది. ఈ కట్టడాన్ని 1632 నుంచి 1648 మధ్య కాలంలో ఆనాటి దిల్లీ సుల్తాన్ షాజహాన్ కాలంలో నిర్మించారు. పూర్తిగా పాలరాతితో ఈ అపురూప కళా కృతిని కట్టారు. యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. దాదాపు 400 ఏళ్ల నుంచి ఈనాటి వరకూ చెక్కుచెదర కుండా తాజ్ మహల్ ఉంది. నిత్యం వందలాది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించి అనుభూతి పొందుతారు. దీంతో భారత ప్రభుత్వానికి ఆదాయం కూడా అధికంగానే సమకూరుతుంది.
అయితే తాజాగా తాజ్ మహల్ లో పగుళ్లను గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. పగుళ్ల నుంచి నీరు కారుతున్నట్లు గుర్తించారు. వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని తేల్చారు. ఈ మేరకు 15 రోజుల పాటు తాజ్ మహల్ కట్టడం అణువణువూ గాలించి ఏమైనా పగుళ్లు ఉన్నాయా..? ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో..? గుర్తించి మరమ్మతులు చేయనున్నారు. ఆ తర్వాత రిపేర్ పనులు ప్రారంభించనున్నారు.
రిపేర్ ను గుర్తించేందుకు పురావస్తు శాఖ బృందం లైట్ డిటెక్షన్, రేంజింగ్ తదితర సాంకేతికతను వినియోగించింది. ఇది రిమోట్ సెన్సింగ్ టెక్నిక్.. లేజర్ ఉపయోగించి వస్తువుల దూరం, నాణ్యతను కొలవడానికి ఉపయోగించబడుతుంది. ఈ టెక్నిక్ ఒక వస్తువుకు లేజర్ పల్స్ ను పంపుతుంది. ఆ కాంతి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కొలుస్తుంది. ఈ సాంకేతికతతో పాటు, గోపురంలోని లోపాలను గుర్తించడానికి GPS, స్కానర్, డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు.

తొలిసారిగా తాజ్ మహల్ ఔరంగజేబ్ కాలంలో 1652 లో నీళ్లు లీకయ్యాయి. ఆ సమయంలో మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత 1872లో మరోసారి నీళ్లు లీకవ్వగా అప్పటి ఇంజినీర్ జేడబ్ల్యూ అలెగ్జాండర్ రిపేర్ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత 1941లోనూ మరమ్మతులు చేపట్టారు.












Click it and Unblock the Notifications