బెదిరిపోయేలా: భూకంపంపై నటి అర్చన, ఖాట్మాండ్‌లో మళ్లీ ప్రకంపనలు
తిరువనంతపురం: నేపాల్లో వచ్చిన భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ భూకంపం ప్రభావం భారత దేశంలోని పలు రాష్ట్రాల పైన పడింది. ఈ నేపథ్యంలో నేపాల్ భూకంపం భయానక పరిస్థితిని తాను అనుభవించానని ప్రముఖ నటి అర్చన కవి చెబుతున్నారు.
నేపాల్లో భూకంపం వచ్చి, భారత దేశంలో ప్రకంపనలు వచ్చిన సమయంలో అర్చన కవి ఢిల్లీలో ఉన్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను ఢిల్లీలో ఉన్నప్పుడు మూడుసార్లు ప్రకంపనలు వచ్చాయని, వాటిని తాను స్వయంగా అనుభవించానని చెప్పారు.

ఆ ఘటన ఎంతో భయానకంగా ఉందని చెప్పారు. ఆమె నేపాల్లోని ఇండియన్ ఎంబసీ హెల్ప్ లైన్లను పోస్ట్ చేశారు. నేపాల్లో భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం నేపథ్యంలో వారి కోసం పూజలు, మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
ఖాట్మాండ్‌లో మరోసారి కంపించిన భూమి
భారీ భూకంపంతో వణికిపోతున్న నేపాల్‌ను వరుస ప్రకంపనలు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇవాల మధ్యాహ్నం నేపాల్లో భూకంప తీవ్రత 3.9గా నమోదయింది. అది మరవక ముందే ఖాట్మాండులో మరోసారి భూమి కంపించింది. ఖాట్మాండులో సుమారు పది కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలు పైన భూకంప తీవ్రత 4.4గా ఉంది.












Click it and Unblock the Notifications