పాకిస్తాన్ పై భారత ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన..!!

పాకిస్తాన్ పై భారత ఆర్మీ చీఫ్ భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ తో యుద్ధానికి శ్రీకారం చుట్టిన గత ఏడాది మే 10వ తేదీ నుండి ఇఫ్పటివరకు 31 ​​మంది పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులను హతమార్చామని అన్నారు. వీరిలో 65 శాతం మంది పాకిస్తాన్ సంతతికి చెందినవారేనని తేల్చి చెప్పారు. వీరిలో పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఆపరేషన్ మహాదేవ్‌ సందర్భంగా కాల్చి చంపినట్లు వెల్లడించారు.

తాజాగా ఉపేంద్ర ద్వివేదీ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది మే 10 నుండి వెస్ట్రన్ ఫ్రంట్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వెంబడి పరిస్థితి సమస్యాత్మకం, సున్నితంగానే ఉందని అన్నారు. భద్రత బలగాలు ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తోన్నాయని, దీనివల్ల సరిహద్దు గ్రామాల్లో చెలరేగిన ఉద్రిక్త వాతావరణం నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో క్రియాశీలంగా ఉన్న స్థానిక ఉగ్రవాదుల సంఖ్య చాలావరకు తగ్గిందని, దాదాపుగా సింగిల్ డిజిట్‌కు చేరిందని ఉన్నారు.

Army Chief Declares India Ready to Launch Ground Operations If Pakistan Falters

2025లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఇద్దరు స్థానికులు మాత్రమే ఉగ్రవాద సంస్థల్లో చేరారని ఉపేంద్ర ద్వివేది అన్నారు. అభివృద్ధి కార్యకలాపాలు, పర్యాటక రంగం పునరుద్ధరణ వంటి చర్యల వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని, అమర్‌నాథ్ యాత్రలో అయిదేళ్ల సగటు కంటే అధికంగా నాలుగు లక్షలకు పైగా యాత్రికులు పాల్గొన్నారని గుర్తు చేశారు.

ఆపరేషన్ సింధూర్ 2 ఇప్పుడూ కొనసాగుతోందని, పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సరే.. సైనిక చర్యకు దిగుతామని ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఎటువంటి తప్పిదానికి పాల్పడినా ధీటుగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్‌లో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, వాటిల్లో ఎల్‌ఓసీ, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని తెలిపారు. వీటిద్వారా ఎటువంటి చర్యలకు పాల్పడినా పాకిస్తాన్ కు మరోసారి పరాభం తప్పదనీ తేల్చి చెప్పారు. సంప్రదాయ యుద్ధ కార్యకలాపాలకు అవకాశం తగ్గిపోయి, నేరుగా అణు రంగంలోకి వెళ్తామని అందరూ భావించారని, దీనికి భిన్నంగా వ్యవహరించామని పేర్కొన్నారు. యుద్ధ రీతుల్లో సంప్రదాయ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించుకున్నామని వివరించారు.

డీజీఎంఓ చర్చల్లో అణు ప్రస్తావన రాలేదని ఉపేంద్ర ద్వివేది ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు, అక్కడి ప్రజలే దీని గురించి మాట్లాడారని, మిలటరీ నుండి అలాంటి సూచనలేవీ తనకు అందలేదని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగిన ఆ 88 గంటల్లో సంప్రదాయ యుద్ధ కార్యకలాపాల పరిధిని విస్తరించడానికి అసాధారణంగా సైన్యాన్ని సమీకరించుకున్నామని తెలిపారు. పాకిస్తాన్ ఏ మాత్రం తప్పు చేసినా, మళ్లీ ఆపరేషన్ ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

పహల్గామ్ దాడి తర్వాత 22 నిమిషాల్లో 'ఆపరేషన్ రీసెట్' వ్యూహం అమలు చేశామని ద్వివేది చెప్పారు. చైనాతో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి, అలాగే ఉత్తర సరిహద్దుల్లోనూ పరిస్థితి స్థిరంగా ఉన్నా నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు. బారత్- మయన్మార్‌ సరిహద్దుల్లో అస్సాం రైఫిల్స్, ఆర్మీ, హోం మంత్రిత్వ శాఖలతో కూడిన సమగ్ర మల్టీ సెక్యూరిటీ గ్రిడ్ పహారా కాస్తోందని, ఈశాన్య ప్రాంతాన్ని స్పిల్‌ఓవర్ ప్రభావాల నుండి రక్షించడానికి కృషి చేస్తోందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+