• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

భారత్-చైనా బలగాలు ఎల్ఏసీ నుంచి వెనక్కి, శాంతి దిశగా..: లైవ్ అప్‌డేట్స్

|

భారత్ చైనా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైనా భారత్ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భారత జవాన్లు తిప్పికొట్టారు. గాల్వాన్ లోయవద్ద జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులు అయ్యారు. చైనా పాల్పడిన ఈ ఘాతుకంపై దేశం తీవ్రస్థాయిలో స్పందించింది. ఇప్పటికే చైనా వస్తువులను బహిష్కరించాలంటూ భారత్‌లో ఒక క్యాంపెయిన్ సైతం నడుస్తోంది. చాలామంది చైనా వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. ఓ వైపు చర్చలంటూనే మరోవైపు డ్రాగన్ కంట్రీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో చైనా యాప్‌లను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి భారత్ చైనాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేదానిపై మినిట్- టూ-మినిట్ అప్‌డేట్స్ మీ కోసం

Army Colonel, 2 jawans killed in violent face-off with Chinese troops live updates

Newest First Oldest First
9:28 PM, 14 Jul
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో సరిహద్దులో డ్రోన్ల ద్వారా నిఘా పెంచేందుకు భారత్ సిద్ధమైంది. ఇజ్రాయెల్ నుంచి శక్తివంతమైన డ్రోన్లను దిగుమతి చేసుకోనుంది.
9:02 PM, 14 Jul
శ్రీరాముడు నేపాలీ, నేపాల్‌లోనే అసలైన అయోధ్య ఉందంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం స్పష్టతనిచ్చింది. ఎవరి మనోభావాలను నొప్పించాలని ఆయన ఈ వ్యాఖ్యలను చేయలేదని అన్నారు. పెద్ద ఎత్తున ఓలి వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
6:46 PM, 14 Jul
గత సోమవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా జాతీయ భద్రతా సలహాదారతో టెలిఫోన్‌పై మాట్లాడిన తర్వాత రెండు దేశాల బలగాలు వెనక్కు మళ్లడం జరిగింది
2:56 PM, 14 Jul
దక్షిణ చైనా సముద్రంలో 2016 ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని చైనాకు సూచించిన ఫిలిప్పీన్స్
2:04 PM, 14 Jul
చైనా తన పొరుగుదేశాలకు సంబంధించిన భూఆక్రమణపై ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ మీడియాలు కథనాలు ప్రసారం చేశాయి
12:09 PM, 14 Jul
భారత్ చైనా దేశాల మధ్య చుషూల్‌లో ప్రారంభమైన మిలటరీ స్థాయి చర్చలు. రెండు దేశాల బలగాలు వాస్తవాధీన రేఖ వద్ద నుంచి ఉపసంహరించుకునే అంశంపై చర్చ
11:41 AM, 14 Jul
మరికాసేపట్లో ప్రారంభం కానున్న భారత్ చైనా మిలటరీ స్థాయి చర్చలు
10:36 AM, 14 Jul
వాస్తవ నియంత్రణ రేఖ నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కు మళ్లాలని భావించిన నేపథ్యంలో ఆయుధాలు,ఇతర పరికరాల వినియోగం కూడా ఉపసంహరించుకునేలా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం
10:35 AM, 14 Jul
ఫింగర్ ఏరియా డెప్సాంగ్ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ సారి చర్చలు కాస్త బలంగా సాగే అవకాశాలున్నట్లు సమాచారం
10:34 AM, 14 Jul
భారత్ చైనాల మధ్య మరోమారు మిలటరీ స్థాయి చర్చలు
10:59 PM, 13 Jul
సరిహద్దులో ఇరుదేశాల బలగాలు వెనక్కి వెళ్లిన నేపథ్యంలో మంగళవారం మరోసారి చైనా, భారత్ మధ్య మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి.
8:12 PM, 13 Jul
ఎయిర్ చైనా,చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్ కార్పోరేషన్,చైనా సౌతర్న్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను మాత్రమే ఫ్రాన్స్‌లోకి అనుమతిస్తామని ఆ దేశ ఎంబసీ పేర్కొంది.
8:05 PM, 13 Jul
చైనాకు వెళ్లే తమ విమానాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో... చైనా నుంచి వచ్చే విమాన సర్వీసులపై తాము కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై వారానికి ఒక్క చైనా విమాన సర్వీసునే ఫ్రాన్స్‌కు అనుమతిస్తామని తెలిపింది.
7:35 PM, 13 Jul
ఒక అంచనా ప్రకారం భారత్‌లో ప్రతీ ఏడాది రక్షాబంధన్ సందర్భంగా రూ.6వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని... ఇందులో చైనా వాటనే రూ.4వేల కోట్లు అని స్పష్టం చేసింది. కాబట్టి ఈసారి చైనా రాఖీ ఉత్పత్తులను నిషేధించాలని సీఏఐటీ పిలుపునిచ్చింది.
7:35 PM, 13 Jul
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు వాణిజ్యపరంగానూ భారత్ బుద్ది చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 59 చైనీస్ యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది. తాజాగా చైనా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే రాఖీలను కూడా నిషేధించాలని ది కాన్ఫడరేషన్స్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) పిలుపునిచ్చింది.
7:35 PM, 13 Jul
మంగళవారం భారత్-చైనా మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చలు జరగనున్న నేపథ్యంలో... అందరి దృష్టి దాని పైనే నెలకొంది.
6:47 PM, 13 Jul
ఇంటెలిజెన్స్ నివేదికతో ఈ యాప్స్‌ను నిషేధించడం జరిగింది
4:39 PM, 13 Jul
ఇరు దేశాల చర్చల సందర్భంగా చైానా యాప్స్ నిషేధంను ప్రస్తావించిన చైనా
4:37 PM, 13 Jul
చైనా యాప్స్ పై నిషేధం విధించిన కొన్ని రోజులకు ఆ విషయాన్ని ప్రస్తావించిన డ్రాగన్ కంట్రీ
1:42 PM, 13 Jul
ఇండో-పసిఫిక్ దేశాల వ్యూహాత్మక చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించాలి కోరిన అమెరికా
1:41 PM, 13 Jul
గాల్వాన్ పాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలో బలగాలను మోహరించి ఆపై భారత్‌ను వెనక్కు పంపి ఆ సరిహద్దును చైనాలో కలిపేసుకోవాలని భావించిన డ్రాగన్ కంట్రీ
12:36 PM, 13 Jul
పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యం సంసిద్ధతపై సమీక్ష చేసేందుకు జమ్మూకు వెళ్లిన ఆర్మీ చీఫ్ నరవాణే
10:08 AM, 13 Jul
రెండు దేశాల మధ్య చర్చలు ముగిసిన అనంతరం చైనా తన మ్యాపును ఇవ్వాల్సిందిగా కోరిన భారత్. అయితే చైనా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు
9:51 AM, 13 Jul
ఆయుధాల ఆధునీకీకరణలో భాగంగా అమెరికా నుంచి 72వేల సిగ్‌సార్ అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయునున్న భారత ఆర్మీ
11:24 PM, 12 Jul
సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకునే పనిలో పడింది. తాజాగా, అమెరికా నుంచి 72000 పవర్ ఫుల్ సిగ్ 716 అసాల్ట్ రైఫిల్స్‌ను రెండోసారి ఆర్డర్ చేసింది.
5:06 PM, 12 Jul
మోడీ హయాంలో ఏం జరుగుతోందంటూ సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
2:36 PM, 12 Jul
న్యూఢిల్లీ
లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. మోడీ పరిపాలనలో పవిత్ర భారత భూమి ఆక్రమణకు గురైందా? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
9:30 AM, 12 Jul
న్యూఢిల్లీ
చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య తైవాన్‌కు కొత్త దౌత్యాధికారిని నియమించనున్న భారత్. అమెరికా సంయుక్త కార్యదర్శిగా ఉన్న గౌరంగలాల్ దాస్‌ను తైవాన్ రాయబారిగా బాధ్యతలు అప్పగించనున్నట్లు వెల్లడించిన అధికారులు.
8:59 AM, 12 Jul
మహారాష్ట్ర
కరోనా వైరస్ బారిన పడిన అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోన్న సినీ ప్రముఖులు, అభిమానులు
8:35 AM, 12 Jul
న్యూఢిల్లీ
చైనాతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటామని వెల్లడించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు
READ MORE

English summary
A Colonel-rank officer of the Indian Army and two soldiers have died in a violent face-off with Chinese troops in Galwan Valley in Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more