కేజ్రీవాల్ నిరసన విరమణ: విక్టరీ, ప్రజలకు సారీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ధర్నాను విరమించారు. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయనతో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆయన అనుచరులు ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి దిగారు. అయితే, ఐదుగురిలో ఇద్దరిని పోలీసులను సెలవుపై పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కేజ్రీవాల్ తన నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.

ఇది విజయమని కేజ్రీవాల్ అన్నారు. తమ నిరనస కార్యక్రమం వల్ల మెట్రో మూసివేత వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమంలో ప్రజలకు దెబ్బ తగలడాన్ని ఆయన ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ విజ్ఞప్తితో కేజ్రీవాల్ ధర్నాను విరమించుకున్నారు.

Arvind Kejriwal calls off protest, claims victory

ఐదుగురు పోలీసుల్లో ఇద్దరిని సెలవుపై పంపించినట్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ కేజ్రీవాల్‌కు తెలిపారు. దీంతో చిరునవ్వుతో లేచి ఇది ప్రజా విజయమని కేజ్రీవాల్ అన్నారు. న్యాయ విచారణను వేగవంతం చేస్తామని లెప్టినెంట్ గవర్నర్ చెప్పారు.

ఓ ముఖ్యమంత్రి తన మంత్రి వర్గ సభ్యులతో ధర్నా చేయడం భారతదేశంలో ఇదే మొదటిసారి అని కేజ్రీవాల్ అన్నారు. ధర్నాను విరమించి గణతంత్ర దినోత్సవాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అంతుకు ముందు కాంగ్రెసుకు చెందిన అజయ్ మాకెన్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+