కేజ్రీ డెసిషన్స్: మార్చి 1 నుంచి విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు, ఉచిత తాగునీరు

న్యూఢిల్లీ: ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 400 యూనిట్ల వరకు 50 శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గించారు.

దీంతో పాటు ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా సరఫరా చేయనున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను తగ్గించడం వల్ల రాజధానిలో 90 శాతం మంది పేదలు లబ్ధి పొందునునట్లు తెలిపారు.

Arvind Kejriwal gifts Delhi 20K litres of free water, power at 50% tariff

తగ్గించిన విద్యుత్ ఛార్జీలు, 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని మార్చి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఢిల్లీ జల్ బోర్డ్ హెల్ప్ లైన్ నెంబర్ (1916)ను తెలియాలని కోరారు.

గత వారంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు, ఉచితంగా తాగునీటిని అందిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్ట్‌లో విద్యుత్ ఛార్జీలు, ఉచిత తాగునీటిని అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+