కశ్మీర్ ఫైల్స్ ఓ అబద్ధం-కేజ్రివాల్ సంచలన కామెంట్స్-ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి
వివేక్ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని ప్రధాని మోడీతో పాటు బీజేపీ కార్యకర్తలంతా ప్రమోట్ చేస్తున్నారు.దీంతో బీజేపీ ప్రత్యర్ధులు ఈ వ్యవహారంపై విమర్శలు సంధిస్తున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా కశ్మీర్ ఫైల్స్ లో పండిట్లను తరిమేసినట్లు, ఊచకోత కోసినట్లు చూపించడం అబద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే ఈ చిత్రానికి బీజేపీ చేస్తున్న ప్రమోషన్ పైనా విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో ఆ పార్టీ యువ మోర్చా కార్యకర్తలు కేజ్రివాల్ నివాసం వద్దకు చేరుకుని దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో కేజ్రివాల్ నివాసం గేటు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కాశ్మీరీ పండిట్ల ఊచకోత అబద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై బిజెపి నిరసనలు చేపట్టింది. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ తన ప్రసంగంలో కశ్మీర్ ఫైల్స్‌ను ప్రచారం చేస్తున్నందుకు బీజేపీపై విమర్శలు గుప్పించారు.

కేజ్రీవాల్ నివాసాన్ని బీజేపీ ధ్వంసం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఆరోపించింది. సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ దాడి! భద్రతా అడ్డంకులు పగలగొట్టిన సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. బీజేపీ ఢిల్లీ పోలీసుల పూర్తి మద్దతుతో కాశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారా? అని ట్వీట్ లో ఆప్ ప్రశ్నించింది. మరోవైపు దేశంలోని హిందువులను అవమానించినందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పే వరకు బిజెపి యువమోర్చా వదిలిపెట్టదంటూ ట్వీట్లో హెచ్చరించారు.












Click it and Unblock the Notifications