స్వదేశీ నినాదంపై ప్రధాని మోడీకి కేజ్రీవాల్ కౌంటర్!
Arvind Kejriwal: ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటూ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఉపన్యాసాలు కాకుండా చర్యలు ఆశించే సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రజలను స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయమని ప్రధాని కోరుతున్నారని.. "కానీ మీరు ప్రయాణించే విదేశీ విమానం, మీరు ఉపయోగించే విదేశీ వస్తువుల మాటేమిటి?" అని ప్రధానిని ప్రశ్నించారు.
అరవింద్ కేజ్రీవాల్ తన పోస్ట్ లో మరిన్ని ప్రశ్నలు సందించారు. "మీరు స్వయంగా స్వదేశీ ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించడం లేదు?. మీరు ప్రతిరోజూ ప్రయాణించే విదేశీ విమానాలను ఎందుకు వదిలిపెట్టరు? మీరు రోజంతా ఉపయోగించే అన్ని విదేశీ వస్తువులను ఎందుకు వదిలేయరు?. భారతదేశంలో పనిచేస్తున్న నాలుగు అమెరికన్ కంపెనీలను ఎందుకు మూసివేయరు?" అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు.

प्रधान मंत्री जी, आप चाहते हैं कि जनता स्वदेशी इस्तेमाल करे।
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 22, 2025
आप ख़ुद स्वदेशी इस्तेमाल करना शुरू कीजिए? जिस विदेशी जहाज़ से रोज़ घूमते हैं, उसे छोड़ दीजिए? सारा दिन जितने विदेशी समान इस्तेमाल करते हैं, उन्हें छोड़ दीजिए।
आप भारत में काम कर रही चार अमेरिकी कंपनियों को बंद कर…
అంతే కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజూ ఇండియాను, భారతీయులను అవమానిస్తున్నారని పేర్కొంటూ.. ప్రధాని చర్యలు తీసుకోవాలని సూచించారు. "ప్రజలు తమ ప్రధానమంత్రి నుంచి ఉపన్యాసాలు కాదు, చర్యలు ఆశిస్తున్నారు" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ప్రధాని పిలుపు.. జీఎస్టీ 2.0
ప్రధానమంత్రి ఆదివారం దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రధాని మోడీ తన ప్రసంగంలో.. ప్రజలు విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి, 'స్వయం-సమృద్ధి' సాధించాలని మోడీ కోరారు. "గర్వంగా చెప్పండి, నేను స్వదేశీ కొనుగోలు చేస్తాను" అని పిలుపునిచ్చారు. అమెరికాతో పెరుగుతున్న సుంకాల వివాదం, వీసా ఫీజు మార్పుల మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
ప్రధాని తన ప్రసంగంలో సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన 'జీఎస్టీ 2.0' గురించి కూడా ప్రస్తావించారు. దీన్ని 'జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్'గా అభివర్ణించారు. జీఎస్టీలో చేసిన ఈ మార్పులు వినియోగదారులకు ఉపశమనం కలిగించి, దేశీయ వినియోగం, ఉత్పత్తిని పెంచుతాయని ఆయన అన్నారు. కొత్త జీఎస్టీ 2.0 ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, 5శాతం, 18శాతం అనే రెండు ప్రధాన పన్ను రేట్లు ఉంటాయి. అయితే విలాసవంతమైన వస్తువులకు 40 శాతం పన్ను ఉంటుంది.
నవరాత్రి.. స్వయం-సమృద్ధి
ప్రధాని ఆదివారం చేసిన వ్యాఖ్యలను ఈరోజు కూడా ట్వీట్ ద్వారా పునరుద్ఘాటించారు. "ఈసారి, నవరాత్రి శుభ సందర్భం చాలా ప్రత్యేకమైనది. జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్‌తో పాటు, ఈ కాలంలో స్వయం-సమృద్ధి మంత్రం కొత్త శక్తిని పొందుతుంది. అభివృద్ధి చెందిన, స్వయం-సమృద్ధిగల భారత సంకల్పం సాధించడానికి సమిష్టి ప్రయత్నాలలో కలిసి రండి" అని ప్రధాని ట్వీట్ చేశారు.
इस बार नवरात्रि का यह शुभ अवसर बहुत विशेष है। GST बचत उत्सव के साथ-साथ स्वदेशी के मंत्र को इस दौरान एक नई ऊर्जा मिलने वाली है। आइए, विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि के लिए सामूहिक प्रयासों में जुट जाएं।
— Narendra Modi (@narendramodi) September 22, 2025
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications