Aryan khan Drugs case: విజయ్ దేవరకొండ హీరోయిన్ కు డ్రగ్స్ మరక; షారుఖ్ ఖాన్ ఇంట్లో ఎన్సీబీ సోదాలు !!
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ మెడకు ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఎన్‌సిబి దాడులు నిర్వహిస్తోంది.
షారూక్ ఖాన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
క్రూయిజ్ డ్రగ్ కేసులో ఏ వన్ నిందితుడైన ఆర్యన్ ఖాన్ ను విచారిస్తున్న క్రమంలో భాగంగా షారుఖ్ ఖాన్ నివాసం అయిన మన్నత్ కు చేరుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బృందం షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. కొడుకు ఆర్యన్ ఖాన్ ను తండ్రి షారుఖ్ ఖాన్ జైల్లో కలవడానికి వెళ్లిన గంటల వ్యవధిలో షారుఖ్ ఖాన్ ఇంటి పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడి చేశారు. అంతేకాదు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కు షాక్ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ హీరోయిన్ కు డ్రగ్స్ కేసుతో లింక్ .. ఎన్సీబీ సమన్లు
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబోలో లైగర్ మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న నటీమణి అనన్య పాండే ఇంట్లో కూడా తనిఖీలను నిర్వహించారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఏ1 నిందితుడు ఆర్యన్ ఖాన్ ఇచ్చిన సమాచారం మేరకు అనన్య పాండే ఇంటి పై దాడి చేసినట్లు తెలుస్తుంది. అనన్య పాండే ఇంటిపై దాడి తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను ఎన్సీబీ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు విచారణకు హాజరు కావలసిందిగా అనన్య పాండే అందజేసిన నోటీసుల లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పేర్కొంది.
ఆర్ధర్ రోడ్ జైలుకు కొడుకును కలవటానికి వెళ్ళిన షారుక్ ఖాన్
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ముంబై అందేరి ప్రాంతంలో దాడులు చేస్తున్నట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ ను కలవడానికి షారుఖ్ ఖాన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2వ తేదీన డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 7వ తేదీ నుండి జైల్లోనే మగ్గుతున్నారు. జైల్లో ఆయన సాధారణ ఖైదీలతో పాటు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికి కోర్టు మూడు సార్లు బెయిల్ నిరాకరించటంతో ఆర్యన్ ఖాన్ తీవ్ర మనస్తాపంలో ఉన్నారు.
దాదాపు 16 నుండి 18 నిమిషాల పాటు ఆర్యన్ ఖాన్ తో మాట్లాడిన షారుక్ ఖాన్
అతనికి ఎలాంటి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని జైలు అధికారులు వెల్లడించారు. ఈ రోజు జైలుకు కొడుకును కలవటం కోసం వెళ్ళిన షారుఖ్ ఖాన్ దాదాపు 16 నుండి 18 నిమిషాల పాటు జైలు అధికారుల ముందు కుమారుడితో మాట్లాడినట్లుగా సమాచారం. ఇక మరోవైపు బుధవారం నాడు ఎన్డీపిఎస్ ప్రత్యేక కోర్టులో ఆర్యన్ ఖాన్ కు బెయిలు నిరాకరించిన తరువాత ఆర్యన్ ఖాన్ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్లు గురువారం నాడు బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. బొంబాయి హైకోర్టు బెయిల్ పిటిషన్ ను అక్టోబర్ 26 వ తేదీన విచారించనున్నట్టు వెల్లడించింది.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టు బిగిస్తున్న నార్కోటిక్స్ .. బాలీవుడ్ లో పెద్ద చర్చ
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడి చేసిన నేపథ్యంలో షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరింత చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇంతగా పట్టు బిగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో అన్న చర్చ బాలీవుడ్ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ను టార్గెట్ చేశారని, అందుకే ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, షారుఖ్ ఖాన్ అభిమానులు, షారుఖ్ ఖాన్ కు మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ వర్గాలు పదే పదే చెప్తున్నాయి. కేంద్రం కావాలని, కేంద్ర దర్యాప్తు సంస్థ షారుక్ ఖాన్ ను టార్గెట్ చేశారని రాజకీయ వర్గాల నుండి విమర్శలు వెల్లువగా మారాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications