Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేప్‌ కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు,విచారణాధికారికి బెదిరింపులు

Recommended Video

    అత్యాచార కేసులో వివాదాస్పద గురువు ఆశారాం దోషి

    జోధ్‌పూర్:అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ జోధ్‌పూర్ కోర్టు తీర్పిచ్చింది. ఆశారాం ఇద్దరు అనుచరులకు 20 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది.

    బుధవారం నాడు ఉదయం ఆశారాం మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని కోర్టు నిర్ధారించింది. ఈ కేసు విషయమై బుధవారం నాడు మధ్యాహ్నం కోర్టు తన తీర్పును వెలువరించింది.ఈ కేసులో ఆశారాంకు జీవిత ఖైదును విధించింది.

    2013 నుండి ఆశారాం బాపు అత్యాచారం కేసులో అరెస్టయ్యారు. అయితే ఆశారాం బాపుతో పాటు మరో ఇద్దరిపై కూడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 7వ తేదిన వాదనలు ముగిశాయి.ఆశారాం బాపు కేసు తీర్పుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాహజాన్‌పుర్‌కు చెందిన అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద ఏడుగురు పోలీసులతో రక్షణ కల్పించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2013 సెప్టెంబరు 1న ఆశారాంను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నాడు.

    16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపును కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా దోషిగా తేల్చింది.ఈ తీర్పు విషయమై న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని ఆశారాం బాపు ప్రతినిధి నీలమ్ దూబే ప్రకటించారు.

    బెదిరింపు ఉత్తరాలు

    బెదిరింపు ఉత్తరాలు

    ఆశారాం బాపు కేసు అనేక మలుపులు తిరిగింది.ఈ కేసు దర్యాప్తు చేసిన సీనియర్‌ పోలీసు అధికారి అజయ్‌ పాల్‌ లంబాకు సుమారు 2 వేల బెదిరింపు ఉత్తరాలు వచ్చాయి. వందల కొద్దీ ఫోన్ కాల్స్ వచ్చాయని ఆ కేసు విచారణను ఆయన గుర్తు చేసుకొన్నారు. . తనకు ఎన్నోబెదిరింపు ఉత్తరాలు వచ్చేవని, వాటిల్లో ఆశారాంకు ఏదైనా జరిగితే తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారని వెల్లడించారు.

    భార్య, పిల్లలను బయటకు రానివ్వలేదు

    భార్య, పిల్లలను బయటకు రానివ్వలేదు

    తన ఫోన్‌ ఎప్పుడూ రింగ్‌ అవుతూనే ఉండేదని ఈ కేసు దర్యాప్తు చేసిన సీనియర్‌ పోలీసు అధికారి అజయ్‌ పాల్‌ లంబా గుర్తు చేసుకొన్నారు. ఈ కేసు విచారణ సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్‌ వస్తే తీయడమే మానేశానని చెప్పారు. తాను ఉదయ్‌పూర్‌కు బదిలీ అయిన తర్వాతే తనకు బెదిరింపులు ఆగిపోయాయని చెప్పారు. తాను కేసు విచారణ జరుపుతున్నఆయన చెప్పారు.

    సాక్షుల మృత్యువాత

    సాక్షుల మృత్యువాత

    2013 ఆగస్టులో తనకు హై ప్రొఫైల్‌ కేసు అప్పగించారని ఆనాడు జోధ్‌పూర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(డీసీపీ)గా పనిచేసిన అజయ్ పాల్ లంబా చెప్పారు.ఈ కేసుకు సంబంధించి ముగ్గురు సాక్షులు హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు.వీరు మరణించడం తనకు భాదగా ఉందన్నారు. ఆశారాం అనుచరుల నుంచి పోలీసులకు తరచూ బెదిరింపులు వస్తుండేవని అన్నారు.

    బాథితుల హర్షం

    బాథితుల హర్షం

    మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా నిర్థారిస్తూ జోథ్‌పూర్ కోర్టు తీర్పు వెలువరించడంపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందంటూ బాధితురాలి తండ్రి చెప్పారు.తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఆశారాంకు న్యాయస్థానం కఠిన శిక్ష విధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేసులో హత్యకు, అపరహణకు గురైన సాక్షుల విషయంలో కూడా ధర్మాసనం న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+