అస్సాంలో కొనసాగుతున్న కౌంటింగ్, ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజ ,కాంగ్రెస్ కూటమిలో టెన్షన్ !!
2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా మరియు స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి వంటి అతి ముఖ్య నేతలలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు ఎవరికి అనుకూలంగా తమ తీర్పును నమోదు చేశారు అన్న ఆందోళన కొనసాగుతున్న కౌంటింగ్ తో సర్వత్రా అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.

అస్సాంలో 47 స్థానాలకు ఫలితాలు
అస్సాం లో జరిగిన ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా అస్సాంలో 47 స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ ఏజిపీ కూటమి, ఎలాగైనా ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గట్టి పోరాటం చేశాయి.అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు కొనసాగాయి. గత ఎన్నికల్లో అస్సాంలో బీజేపీ -ఏజీపీల కూటమి నలభై ఏడు స్థానాలకు 35 సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీ కూటమికి అనుకూలంగా ప్రారంభ ట్రెండ్స్
ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి తీవ్రంగా ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రియాంక గాంధీ వంటి ప్రముఖ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సైతం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని,అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ప్రారంభ ట్రెండ్స్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌర పట్టిక ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ పోరు ఏ విధంగా ఉండబోతుంది. ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం బిజెపి 29 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యత
ప్రస్తుతం అస్సాంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కరోనా జాగ్రత్తలు తీసుకొని మరి అధికారులు కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజలో కనిపించింది. ప్రస్తుతం అస్సాంలో బిజెపి 29 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నాయి. ప్రారంభ ట్రెండ్స్ అస్సాంలో ఈసారి బిజెపి, ఏజీపీ కూటమి మరలా పాగా వేస్తుంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications