అటల్ పెన్షన్ యోజనపై కేంద్రం శుభవార్త: కోట్ల మందికి భరోసా ఇస్తూ కీలక నిర్ణయం..!
Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు, సామాన్యులకు తీపికబురు అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అటల్ పెన్షన్ యోజన గడువును 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలోని కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏమిటీ అటల్ పెన్షన్ యోజన?
అసంఘటిత రంగంలో పనిచేసే వారు తమ వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు 2015 మే 9న కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చందాదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత వారు చెల్లించిన చందాను బట్టి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీతో కూడిన పెన్షన్‌ను పొందుతారు.

కేబినెట్ నిర్ణయంలోని ముఖ్యాంశాలు:
ఈ పథకం ఇకపై 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.ఈ పథకం వ్యాప్తిని పెంచడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి, గ్యాప్ ఫండింగ్ కోసం కేంద్రం నిధుల మద్దతును కూడా పొడిగించింది. జనవరి 19, 2026 నాటికి ఈ పథకంలో సుమారు 8.66 కోట్ల మంది పైగా చందాదారులు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులకు చేరువ కావడానికి ప్రభుత్వం సామర్థ్య పెంపుదల, అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోనున్నారు.
ఈ పథకంలో చేరడం ఎలా?
18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఈ పెన్షన్ స్కీంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఖాతాలో కానీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ స్కీంలో చేరేవారు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందేలా ఏదో ఒక స్లాబ్ ఎంచుకోవాలి. చందాదారులు ఎంచుకున్న పెన్షన్ మొత్తం.. పథకంలో చేరినప్పటి వయస్సును బట్టి తాము చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం మారుతుంది. ఎంత తక్కువ వయసులో చేరితే ప్రీమియం అంత తక్కువగా చెల్లించాల్సి వస్తుంది.
పెన్షన్ స్లాబ్‌లు: చందాదారులు తమ వయస్సు, ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000, రూ. 5,000 ...వీటిలో తాము ఎంచుకున్న మొత్తాన్ని పెన్షన్ రూపంలో ప్రతి నెలా పొందుతారు. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతకడానికి అటల్ పెన్షన్ యోజన ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరిన్ని కోట్ల మందికి ఈ పథకం కింద సామాజిక భద్రత లభించనుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications