విజయ్ మాల్యా ఆటకట్టు: 1,700 కోట్ల షేర్లు సీజ్

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా పలు బ్యాంకులకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోవడంతో ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి ఝలక్ ఇచ్చింది.

విజయ మాల్యా ప్రకటిత నేరస్తుడు అని అక్రమ దనార్జన నిరోధక కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ప్రకటించడంలో ఇప్పుడు ఈడీ తన దూకుడు పెంచి విజయ్ మాల్యాకు పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ మాల్యాకు చెందిన పలు ఆస్తులను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది.

Attachment of Mallya assets: ED makes Rs 1,700 crore fresh seizures

ఇప్పుడు విజయ్ మాల్యాకు చెందిన రూ. 1,700 కోట్ల విలువైన షేర్లను సీజ్ చేసింది. యూబీ, యూఎస్ఎల్ షేర్లు సీజ్ చేసి విజయ్ మాల్యాకు చుక్కలు చూపించింది. ఈ దెబ్బతో విజయ్ మాల్యా మరన్ని చిక్కుల్లో పడ్డారు.

ఇటీవల భారత్ పర్యటకు వచ్చిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో భేటీ అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ మీదేశంలో తలదాచుకున్న విజయ్ మాల్యాను అప్పగించాలని ఆమెకు మనవి చేశారు. అంతలోనే ఈడీ తన దూకుడు పెంచడంతో త్వరలోనే విజయ్ మాల్యాను భారత్ తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+