పాక్ బోర్డర్ క్లోజ్: తట్టా బుట్టా సర్దుకోండమ్మా- డెడ్‌లైన్ ఇదే: దాటితే జైళ్లల్లో మగ్గాల్సిందే

Attari Border Checkpost: అట్టారీ సరిహద్దు చెక్‌పోస్ట్ మూత పడింది. నిర్మానుష్యంగా మారింది. రాత్రి 9 గంటల సమయంలో ఈ చెక్‌పోస్ట్‌ను సరిహద్దు భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. దీన్ని మూసివేశాయి. పాకిస్తాన్‌తో అధికారికంగా రాకపోకలు సాగించడానికి ఇన్ని సంవత్సరాలు అందుబాటులో ఉంటూ వస్తోన్న ఈ చెక్‌పోస్ట్.. ఇక ఇప్పట్లో తెరచుకోవడం అసాధ్యం.

పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్సాటైన భద్రత వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయాలను తీసుకుంది.

Attari border checkpost was closed and Pakistani nationals return through that route before May 1

పహల్గామ్‌లో చోటు చేసుకున్న మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల కేబినెట్ సబ్ కమిటీ పలు కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఇందులో ఒకటి.. ఈ అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేయడం.

అధికారిక ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పంజాబ్ అమృత్‌సర్ సమీపంలో ఉన్న ఈ బోర్డర్‌ను బీఎస్ఎఫ్ అధికారులు మూసివేశారు. పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నిన్నటి వరకూ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ సరిహద్దు చెక్‌పోస్ట్ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే.

చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే అవకాశాలు ఉండకపోవచ్చు.

అత్యవసర వైద్య చికిత్స, వ్యాపార కార్యకలాపాలు, ఇక్కడ నివసిస్తోన్న తమ బంధువులను కలుసుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి కారణాలతో తరచూ పలువురు పాకిస్తానీయులు విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు జారీ చేసే అధికారిక డాక్యుమెంట్లతో
భారత్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్కటి ఈ అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్.

పహల్గామ్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వాళ్లంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మే 1 తేదీ లోపలే భారత్‌ను వదిలి తమ దేశానికి వెళ్లి పోవాల్సి ఉంటుంది. అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్ ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులకు జైలు శిక్ష తప్పకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+