బాలిలోనే చోటా రాజన్‌ను లేపేయాలనుకున్న దావూద్
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. చోటా రాజన్‌ను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడా? అంటే అవుననే అంటున్నారు. దావూద్ వేసిన ప్లాన్ కొద్దిలో తప్పిపోవడంతో చోటా రాజన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ వెలుగు చూసింది.
చోటా రాజన్‌ను దావూద్ ఇబ్రహీం ఎలా చంపాలనకున్నది... దావూద్ అనుచరుడు చోటా షకీల్ ఆడియో సందేశంలో కనిపించింది. ఇండోనేషియాలోనే చోటా రాజన్‌ను దావూద్ చంపేయాలనుకున్నాడు. చోటా షకీల్ ఆ ప్లాన్‌ను వివరించాడు.
ఓ మీడియా సంస్థ ప్రతినిధికి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. చోటా రాజన్‌ను లాకప్‌లోనే చంపేస్తారా? అన్న ఓ ప్రశ్నకు ఫోన్లో వేగంగా స్పందించిన షకీల్... రాజన్ చంపేసేందుకు ఇండోనేసియా నగరం బాలిలోనే ప్లాన్ వేశామని చెప్పాడు.

కొంతమేర సమాచారం రాని నేపథ్యంలోనే తమ ప్లాన్ విఫలమైందన్నాడు. అతనిని భారత్‌లో అంతే చేస్తామన్నాడు. బాలిలో అరెస్ట్ తర్వాత చోటా రాజన్ పలుమార్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఓ పురుషుడితో పాటు మహిళను జర్నలిస్ట్‌గా రంగంలోకి దించామని చోటా షకీల్ చెప్పాడు.
సదరు నకిలీ విలేకర్లకు ఐడీ కార్డులతో పాటు కెమెరాలు కూడా అందించామన్నాడు. జర్నలిస్టుల రూపంలో రాజన్ వద్దకు వెళ్లిన తర్వాత ఆ మహిళ రాజన్ పైన కాల్పులు జరపాలని తాము ప్లాన్ వేశామన్నాడు. అయితే అంతమంది దగ్గరగా ఉన్న సమయంలో ఆయుధం తీసి అతన్ని కాల్చేందుకు వీలుకాలేదన్నాడు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications