బెంగాల్ ఆడియో క్లిప్స్ వార్: నందిగ్రాం కోసం బీజేపీ నేతకు మమతా బెనర్జీ ఫోన్, పోటీగా టీఎంసీ క్లిప్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నవేళ ఆడియో క్లిప్పుల యుద్ధం నడుస్తోంది. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి సంబంధించిన ఓ ఆడియో క్లిప్పును బీజేపీ విడుదల చేయగా, బీజేపీకి కీలక నేతకు సంబంధించిన ఆడియో క్లిప్పును టీఎంసీ విడుదల చేయడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

నందిగ్రామ్ గెలుపు కోసం బీజేపీ నేతకు మమతా బెనర్జీ ఫోన్..
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసి నందిగ్రామ్‌లో తన గెలుపునకు సహకరించాలని కోరినట్లుగా ఉన్న ఓ ఆడియోను బీజేపీ నేత ప్రళయ్ పాల్ శనివారం విడుదల చేశారు. నందిగ్రాంలో మాజీ టీఎంసీ నేత సువేందు అధికారితో మమతా బెనర్జీ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన గెలుపునకు సహకరించాలని తనను మమత కోరినట్లు ప్రళయ్ పాల్ ఆడియోను విడుదల చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే, ఆ ఆడియోలో మాట్లాడింది మమతా బెనర్జీనే అనేందుకు తగిన ఆధారాలేవీ లేవని టీఎంసీ పేర్కొంటోంది.
సువేందు అధికారి, బీజేపీతోనే ఉన్నానంటూ ప్రళయ్ పాల్
'ఆమె(మమతా బెనర్జీ) తన కోసం పనిచేయాలని నన్ను కోరింది. అయితే, నాకు సువేందు అధికారి, ఆయన ఫ్యామిలీతో ఉన్న అనుబంధం చాలా పాతది. ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నా' అని ప్రళయ్ పాల్ వెల్లడించారు. కాగా, ఈ నేపథ్యంలో టీఎంసీ.. బీజేపీకి సంబంధించిన ఓ ఆడియోను విడుదల చేసింది.
బీజేపీకి పోటీగా టీఎంసీ ఆడియో క్లిప్..
ఎన్నికల సంఘాన్ని ప్రభావం చేసేందుకు బీజేపీ నేత ముకుల్ రాయ్.. మరో నేత శశిర్ బజోరియాతో సంభాషించినట్లున్న ఓ ఆడియోను టీఎంసీ తాజాగా విడుదల చేసింది.
ఆడియో క్లిప్‌లో, ముకుల్ రాయ్ శిశిర్ బజోరియాతో మాట్లాడుతూ.. నిబంధనలలో మార్పులు కోరుతూ ఈసీని సంప్రదించాలని, తద్వారా ఇతరులు బూత్ ఏజెంట్లుగా ఉండటానికి అనుమతించబడతారు, లేకపోతే ఆ ప్రాంతాలలోనే కాదు, పెద్ద ఎత్తున బూత్‌లలో బీజేపీ ఏజెంట్లను ఇవ్వలేరు' మాట్లాడుకున్నారని టీఎంసీ ఆరోపించింది. ఆ తర్వాత బీజేపీ ఈసీని కోరగా.. వారికి అనుకూలంగా చర్యలు తీసుకోవడం జరిగిందని టీఎంసీ ఆరోపించింది. పార్టీ నుంచి వెళ్లినివారిని తిరిగి రావాలని కోరడం మమతా బెనర్జీ గొప్పతనమని టీఎంసీ నేత సుబ్రతా ముఖర్జీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications