ఊహాగానాలకు తెర: యాక్సిస్‌ను ఆమె వీడట్లేదు.. మరో మూడేళ్లు!
మరో మూడేళ్ల పాటు శిఖా శర్మనే సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ యాక్సిస్ నిర్ణయం తీసుకుంది.
ముంబై: యాక్సిస్ బ్యాక్ సీఈవోగా శిఖా శర్మ తప్పుకుంటున్నారన్న ఊహాగానాలకు తెర పడింది. మరో మూడేళ్ల పాటు శిఖా శర్మనే సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ యాక్సిస్ నిర్ణయం తీసుకుంది. దీంతో 2021జూన్ వరకు శిఖా శర్మ ఆ పదవిలో కొనసాగనున్నారు.
2017జులై 26న దీనిపై చర్చించడానికి యాక్సిస్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే శిఖా శర్మ పున:నియామకాన్ని ఆమోదించారు. తాజా ఆమోదం 2018జూన్ 1 నుంచి అమలులోకి రానుందని తాజాగా బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో యాక్సిస్ పేర్కొంది.

ఇదిలా ఉంటే, ఈ వారం ప్రారంభంలో టాటా ఫైనాన్సియల్ సర్వీసెస్ వర్టికల్ అధినేతగా శిఖా శర్మను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రతిపాదించారని ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో యాక్సిస్ నుంచి ఆమె తప్పుకోవడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది.
దీనిపై స్పందించిన శిఖా శర్మ ఊహాగానాలను తోసిపుచ్చారు. 'ప్రస్తుతం మన మధ్య చక్కర్లు కొడుతున్నవన్ని రూమర్లే, వాటిలో ఎలాంటి నిజాలు లేవు. ఇనిస్టిట్యూట్ కు ఎంతో అంకితభావంతో పనిచేసే నేను ఈ రూమర్లను మార్చలేను' అని శర్మ చెప్పారు.
యాక్సిస్ కు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని, షేర్ హోల్డర్స్ తో కలిసి పనిచేయడానికి తాను శాయశక్తులా పనిచేస్తానని అన్నారు. కాగా, శిఖా శర్మను యాక్సిస్ బ్యాంకు 2009లో నియమించుకుంది. ఐసీఐసీఐ నుంచి ఆమె యాక్సిస్ కు మారారు. 1980లో ఇన్ ఫ్రా లెండర్ ఐసీఐసీఐ లిమిటెడ్ లో ఆమె కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత గ్రూప్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ బిజినెస్ లలో కీలక పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications