అయోధ్యలో ప్రాణప్రతిష్ట ముందస్తు ఆచారాల షెడ్యూల్ ఇదే.. 22న చారిత్రాత్మక ఘట్టం!!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతుంది. ఇప్పటికే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి సాంప్రదాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీన జరగనున్న రామాలయ ప్రారంభోత్సవానికి 7వేల మందికి పైగా అతిథులు వస్తారని అంచనా వేస్తున్నారు.
నేటి నుండి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు క్రతువులు ప్రారంభం కాగా సరయు నదీ తీరాన నేడు విష్ణు ప్రార్థన, దశవిధ స్నానం, గోదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 17వ తేదీన రాములల్లా విగ్రహంతో కూడిన ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. సరయూ నది నీటితో ఉన్న మంగళ కలశాలు శ్రీరామ జన్మభూమికి చేరుకుంటుంది.

ఆపై జనవరి 18వ తేదీన గణపతి అంబికా పూజ, వరుణ పూజ, మాత్రిక పూజ, బ్రాహ్మిన్ వరణ్, వాస్తు పూజలు జరుగుతాయి. వీటితో సాంప్రదాయ కార్యక్రమాలు కూడా అధికారికంగా మొదలవుతాయి. జనవరి 19వ తేదీన అగ్నిదేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. నవగ్రహాల ప్రతిష్ట జరుగుతుంది.
జనవరి 20వ తేదీన రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నది నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం వాస్తు శాంతి నిర్వహించి అన్న దివస్ చేపడతారు. జనవరి 21వ తేదీన 125 పవిత్ర కళాశాలతో రామచంద్రుడు విగ్రహానికి స్నానం చేయిస్తారు. 22వ తేదీన అయోధ్యలో అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది .
150 దేశాల నుండి ప్రజలు అయోధ్యకు చేరుకుని శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి ఒంటిగంట వరకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఇక జనవరి 21, 22 తేదీలలో సాధారణ ప్రజలకు ఆలయంలోకి అనుమతి ఉండదు. 23వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ శ్రీ రామచంద్రుని దర్శించుకోవచ్చు. 500ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అయోధ్యకు రామయ్య చేరుకునే ఘట్టం హిందువులందరి మనసులను పులకితం చేస్తుంది.












Click it and Unblock the Notifications