Ayodhya Shocker: మొదటి రాత్రి మరణ రహస్యం.. అయోధ్యలో వధూవరుల మృతి వెనుక సీక్రెట్ ఏంటి?

Ayodhya Shocker: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పెళ్లి రాత్రి వధూవరులిద్దరి మరణ రహస్యం ఇంకా వీడలేదు. పోస్టుమార్టం నివేదికలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వధువు శివాని గొంతు నులిమి చనిపోగా.. వరుడు ప్రదీప్ ఉరేసుకుని మరణించాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ప్రదీప్ మొబైల్ కు రాత్రి పూట ఏదో ఒక మెస్సేజ్ లేదా ఫోటో లేదా వీడియో వచ్చి ఉండవచ్చని.. ఆ తర్వాత ఈ దారుణం జరిగి ఉండవచ్చనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. గది తలుపు లోపలి నుంచి లాక్ చేయబడింది. కాబట్టి బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. ఈ క్రమంలోనే ప్రదీప్ మొదటి శివానిని గొంతు నులిమి చంపి.. ఆపై ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రస్తుతం భావిస్తున్నారు. శివాని, ప్రదీప్ తల్లిదండ్రులను విడివిడిగా విచారించి అసలు విషయం ఏమిటని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు.

కుటుంబ సభ్యుల అభిప్రాయం ప్రకారం, గది తలుపు లోపలి నుండి లాక్ చేయబడింది, కాబట్టి బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. అందుకే ప్రదీప్ మొదట శివానీని గొంతు కోసి చంపి, ఆపై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రస్తుతం భావిస్తున్నారు. శివానీ, ప్రదీప్ తల్లిదండ్రులతో విడివిడిగా మాట్లాడి చుక్కలను కలిపే ప్రయత్నం చేశాడు ఎస్‌ఎస్‌పి రాజ్ కరణ్ నయ్యర్.

Ayodhya Shocker The Mystery Behind the Deaths of Newlyweds on Their First Night

ఓ జంట పెద్దల అంగీకారంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. శోభనం గదిలోకి నవ్వుతూ లోపలికి వెళ్లిన ఆ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ్ నగరంలో చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..సహదత్‌గంజ్ ప్రాంతానికి చెందిన ప్రదీప్‌కు సమీప ప్రాంతానికి చెందిన శివానితో వివాహం జరిపించారు. ఇద్దరి అంగీకారంతోనే ఈ వివాహం జరిగింది. పెళ్లి తతంగంలో నూతన జంట నవ్వుతూనే కనిపించారు.

పెళ్లి రాత్రి వధూవరులు ఎలా చనిపోయారు?
ఈ జంట పెద్దల అంగీకారంతోనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వివాహ సంప్రదాయాల నుంచి వీడ్కోలు వరకు ప్రతీదీ బాగానే జరిగింధి. వధూవరులిద్దరూ సంతోషంగా కనిపించారు. వివాహ ఊరేగింపులో చాలా నృత్యాలు జరిగాయి. స్నేహితులు, బంధువులతో చాలా సరదాగా గడిపారు. శివాని, ప్రదీప్ చాలా ఎంజాయ్ చేశారు. కానీ మొదటి రాత్రి ఊహించని పరిణామం జరిగింది. శోభనం గదిలోకి వెళ్లిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మరుసటి రోజూ ఎంతకు బయటకు రాలేదు. అనుమానం వచ్చి కుటుంబసభ్యులు డోర్ పగులగొట్టి చూడగా.. ఇద్దరు చనిపోయి కనిపించారు. పెళ్లి రాత్రి గదిలోకి ప్రవేశించిన తర్వాత ఏదో జరిగింది. దాని కారణంగా ఈ వివాహం 24 గంటల్లోనే విషాదంగా మారింది. వారిద్దరి జీవితాలను అంతం చేసిన ఆ రాత్రి సరిగ్గా ఏమి జరిగిందో పోలీసులు ఇంకా తెలుసుకోలేకపోయారు.

శివానీ దగ్గర మొబైల్ లేదు..
శివాని కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. ఈ పెళ్లి గురించి గత సంవత్సరం నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్ లోనే వివాహం చేయాలని అమ్మాయి కుటుంబం కోరిక వ్యక్తం చేసింది. కానీ ప్రదీప్ కుటుంబం మార్చిలోనే వివాహం చేయాలని పట్టుబడింది. దీంతో దానికి అంగీకరించారు. శివానీ, ప్రదీప్ పెళ్లికి ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారని చెబుతున్నారు. కానీ శివాని దగ్గర మొబైల్ ఫోన్ లేదనే ఆశ్చర్యకరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

ప్రదీప్ చనిపోయే ముందు అతని మొబైల్ కు ఏమైనా సందేశం వచ్చిందా?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఒక కోణం బయటపడుతోంది.అది ఏమిటంటే.. రాత్రిపూట ప్రదీప్ మొబైల్ ఫోన్ కు ఏదో ఒక సందేశం లేదా ఫోటో వచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రదీప్ కోపంతో శివాని నోరు నొక్కి ఉండవచ్చని.. ఆమె పొరపాటున ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. శివాని చనిపోయిందని తెలియగానే ప్రదీప్ భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గురించి కుటుంబ సభ్యులు మౌనంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా శివాని దగ్గర మొబైల్ ఫోన్ లేదనే అంశం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కూడా ఇప్పటివరకు కచ్చితమైన నిర్ధారణకు రాలేకపోయారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+