అజాద్ ఎన్‌కౌంటర్‌పై పిటిషన్ కొట్టివేత: హైకోర్టులో సవాల్ చేస్తామన్న పద్మ(ఫొటోలు)

ఆదిలాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరకూరి రాజ్‌కుమార్ ఎన్‌కౌంటర్ ఉదంతంలో 29మంది పోలీసులపై హత్యా నేరం నమోదు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం ఆదిలాబాద్‌లోని జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మేరీ సారాధానమ్మ కొట్టివేశారు.

Azad 'Encounter' Case: Protest Petition Dismissed

2011లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ బూటకమంటూ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జర్నలిస్టు హేమచంద్ర పాండే సహచరి బబితా పాండే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు. దీంతో విచారణ చేపట్టాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది.

Azad 'Encounter' Case: Protest Petition Dismissed

ఆ తర్వాత ఆత్మరక్షణ కోసమే పోలీసులు, ఆజాద్, హేమచంద్ర పాండేలను ఎదురుకాల్పుల్లో కాల్చి చంపారని సిబిఐ నివేదిక అందజేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని దిగువ కోర్టుల్లోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ మేరకు ఆజాద్ సహచరి పద్మ, బబితా పాండే ఆదిలాబాద్ కోర్టులో 2013లో ప్రొటెస్టు పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఏడాదిన్నరపాటు వాద ప్రతివాదనలు విన్న అనంతరం మంగళవారం తీర్పు వెలువడింది. కాగా, ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని పద్మ మీడియాకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+