నరేంద్ర మోడీ నోట్ల రద్దుపై రాందేవ్ బాబా అసంతృప్తి!
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన స్పందించినట్లుగా తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన స్పందించినట్లుగా తెలుస్తోంది. ది క్వెంట్‌లో వచ్చిన దాని ప్రకారం.. నోట్ల రద్దు తర్వాత రూ.3 నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం వెలుగు చూస్తుందన్నారు.
నవంబర్ 8వ తేదీన ప్రధాని మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు బ్యాంకు అధికారులు కొత్త నోట్లను వక్రమార్గంలో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా స్పందించారు.

నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన రాందేవ్ బాబా అంత సంతృప్తిగా లేనట్లుగా కనిపిస్తోందని ది క్వెంట్ పేర్కొంది. అవినీతి బ్యాంకు అధికారులు మోడీ నిర్ణయాన్ని తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు అమలు తీరు దారుణంగా ఉందని కూడా మరో పత్రికతో వ్యాఖ్యానించారని పేర్కొంది.
నోట్ల రద్దు అమలును మరింత బాగా చేయవలసి ఉండెనని అభిప్రాయపడ్డారు. పలువురు బ్యాంకర్లు డబ్బును పక్కదారి పట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇది మన వ్యవస్థ తీరును ప్రశ్నిస్తోందన్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications