Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..!
తెలంగాణ బీజేపీ మహిళా నాయకురాలు కొంపెల్ల మాధవీ లత (Madhavi Latha)మరోసారి వార్తల్లో నిలిచారు. హిందూత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ముస్లిం నేతలపై సూటి విమర్శలు చేయడంలో ముందుండే మాధవీ లత.. ఈసారి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో పూజలు చేశారు. ఎయిర్ పోర్టులో మహిళలు ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన రూమ్ లో కొందరు ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటుండగా.. అక్కడికి వెళ్లి మాధవీలత పూజలు చేశారు.
"ఈ హడావిడి నడుమ ఒక ప్రశాంత క్షణం-భారత హృదయంలోని దైవానికి ప్రణామాలు. లోక కళ్యాణం (ప్రపంచ శ్రేయస్సు) సాధనలో, మొదట అంతరాత్మ సఖ్యతను సాధించాలి. ఢిల్లీ విమానాశ్రయం ప్రార్థనా మందిరంలో, నేను విశ్వమాత నుండి శక్తిని పొందుతూ, దుర్గా సూక్తంలోని దివ్య శ్లోకాలలో లీనమయ్యాను.మన గొప్ప దేశమైన భారత్, మన ప్రాచీన ఆరాధనా విలువలకు నిదర్శనంగా ఈ పుణ్యక్షేత్రాలను అందిస్తున్నప్పటికీ, వాటి శుద్ధి (పవిత్రత) బాధ్యత మనపైనే ఉంది. ఇవి సాధకుడికి, భక్తుడికి మరియు ప్రశాంత ఆత్మకు చెందిన ప్రదేశాలు. ఈ ప్రార్థనా మందిరాలలోని ప్రతి అంగుళాన్ని ఒక పుణ్యక్షేత్రంగా భావిద్దాం. అవి గాఢమైన నిశ్శబ్దానికి మరియు లోతైన ఆధ్యాత్మిక అనుబంధానికి నిలయాలుగా నిలవాలి" అంటూ మాధవీ లత ట్వీట్ చేశారు. దీనికి ఆ వీడియోను కూడా జత చేశారు.

A moment of stillness amidst the rush - Pranams to the Divine in the Heart of Bharat
— Kompella Madhavi Latha (@Kompella_MLatha) March 23, 2026
In the pursuit of Loka Kalyan (the well-being of the world), one must first find inner alignment. At the Delhi Airport prayer room, I immersed myself in the celestial verses of the Durgā Sūktam,… pic.twitter.com/z8fmJT0JQx
మాధవీ లత వీడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది. దీనిపై జనం రెండుగా విడిపోయారు. కొందరు ఆమె చర్యకు మద్దతు పలుకుతుండగా.... మరికొందరు మాత్రం మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల జాతీయ కోఆర్డినేటర్ మహమ్మద్ వసీం.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ, "ప్రార్థన గది కేవలం నిశ్శబ్ద ప్రార్థనలు మరియు ధ్యానం కోసం మాత్రమే కాబట్టి దయచేసి చర్య తీసుకోండి. ఈ మహిళ శబ్దంతో, కెమెరాతో ప్రార్థన చేస్తూ నియమాన్ని ఉల్లంఘించి, ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నారు" అని అన్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications