యుపి బాదౌన్ కేసు: అక్కాచెల్లెళ్లపై రేప్ జరిగింది
లక్నో: ఉత్తరప్రదేశ్ డిజిపి సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ బాదౌన్ అక్కాచెల్లెళ్లపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాదౌన్ జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే.
ఇద్దరిలో 14 ఏళ్ల అమ్మాయి యోని చట్టూ గడ్డ కట్టిన రక్తం కనిపించిందని, రక్తం కారి గడ్డ కట్టిన గుర్తులున్నాయని వైద్యులు తేల్చారు. అత్యాచారం జరిగిందని చెప్పడానికి తగిన ఆధారాలు పోస్టుమార్టం నివేదికలో బయపడ్డాయి. అత్యాచారం జరిగిందనే గుర్తులున్నాయని వైద్యుల బృందం అభిప్రాయపడింది.

బలవంతంగా అంగప్రవేశం జరిగిందని చెప్పడానికి యోని ముఖద్వారం వద్ద గడ్డ కట్టిన రక్తం ఆధారమని ప్రభుత్వ గైనకాలజిస్టు అభిప్రాయపడ్డారు. మృతురాలు తీవ్రంగా ప్రతిఘటించిందని చెప్పడానికి కూడా ఆధారాలున్నట్లు చెప్పారు. అమ్మాయి అంతకు ముందు లైంగిక క్రీడకు అలవాటు పడలేదని వైద్య పరీక్షల్లో తేలింది.
16 ఏళ్ల మరో అమ్మాయిపై కూడా అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలింది. అలా చెప్పడానికి గల ఆధారాలను వైద్యుల బృందం వివరించింది. యోని చిట్లడమే అత్యాచారం జరిగిందని చెప్పడానికి ఆధారమని అంటున్నారు.












Click it and Unblock the Notifications