బదౌన్ రేప్: బాధితుల కుటుంబీకులకు పాలీగ్రాఫ్ టెస్ట్

Badaun rape: Victims' kin undergo polygraph test
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో ఇటీవల జరిగిన అక్కా చెల్లెళ్ల(కజిన్ సిస్టర్స్) అత్యాచారం, హత్య కేసులో బాధితుల బంధువులకు సిబిఐ పాలీగ్రాఫ్ టెస్ట్(అబద్ధపు శోధన పరీక్ష) నిర్వహించినట్లు తెలిసింది. సిబిఐ వర్గాల సమాచారం ప్రకారం.. అత్యాచారానికి గురైన ఇద్దరు బాధితురాళ్ల తండ్రులను, ఓ బంధువును, ఓ సాక్షిని న్యూఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ తీసుకెళ్లి వారికి పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.

కాగా, సిబిఐ వ్యవహరించిన తీరు పట్ల బాధితుల కుటుంబ సభ్యులు, నయా దార్ పార్టీ కార్యకర్తలు జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. తమ కుటుంబసభ్యులపై సిబిఐ వేధింపులు ఆపాలని బాధితురాలి సోదరుడు వీరేంద్ర డిమాండ్ చేశారు. సిబిఐ నిందితులపై దృష్టి సారించకుండా బాధితులను వేధించడమేంటని ఆయన ప్రశ్నించారు.

మూడు రోజుల పాటు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం సిబిఐ ఆ నలుగుర్ని వదిలిపెట్టనుంది. పరీక్షలు తొందరగా పూర్తయితే త్వరగా పంపించే అవకాశం ఉంది. సోమవారం నుంచి సిబిఐ వీరికి పరీక్షలు నిర్వహిస్తోంది.

కాగా, తమను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని వారు ఆరోపించారు. బాధిత యువతి సెల్‌ఫోన్ ఎలా పగిలిపోయిందని పదే పదే సిబిఐ ప్రశ్నిస్తోందని అన్నారు. తాము బాధితురాలి బంధువులను అనుమానించడం లేదని.. వారి నుంచి వివరాలు సేకరించేందుకే వారిని ప్రశ్నిస్తున్నామని సిబిఐ అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+