నన్ను చంపేందుకు ఉగ్రవాదుల కుట్ర: తస్లీమా, మోడీని కలవాలని..
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన రచయిత్ అవిజిత్ రాయ్, బ్లాగర్ వషీకర్ రెహమాన్‌ను హత్య చేసిన బంగ్లాదేశ్ ఉగ్రవాదులు తనను చంపేందుకు కుట్ర పన్నారని ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. అవిజిత్, వషీకర్‌లను ధ్వేషిస్తూ ఆన్‌లైన్‌లో సందేశాలు చేసిన అనంతరమే వారిని ఉగ్రవాదులు హతమార్చారని తెలిపారు.
ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుని సందేహాలు పంపుతున్నారని, తనను కూడా హత్య చేసేందుకు అన్సరుల్లా బంగ్లా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆమె చెప్పారు. ఏదైమైనా తాను మైనంగా ఉండదల్చుకోలేదని తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం తస్లీమా నస్రీన్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నట్లు నిఘా నివేదికల సమాచారం.

తస్లీమా పుట్టిన రోజున వషీకర్ ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం అతడు ఉగ్రవాదుల దాడిలో హతమయ్యాడని వెల్లడించాయి. ఢాకా పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. రెహమాన్‌ను హత్య చేసిన అన్సరుల్లా బెంగాలీ టీమ్ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్‌లోకి ప్రవేశించినట్లు పేర్కొంది. వారి లక్ష్యం ఢిల్లీలోని తస్లీమాను హత్య చేయడమేనని వెల్లడించింది.
కాగా, ఏప్రిల్ 19న తస్లీమా నస్రీన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘మోడీజీ మిమ్మల్ని కలిసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నా. దయచేసి నా ఆకాంక్షలను తీర్చండి. మీ టి' అని పేర్కొంది.
Dear @narendramodi @PMOIndia, I have been trying desperately to meet you, Modiji. Would you kindly fulfill my wishes? Sincerely Yours, T
— taslima nasreen (@taslimanasreen) April 19, 2015 











Click it and Unblock the Notifications