వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూపాయికే లీటర్ పెట్రోల్.. 500 మందికే ఛాన్స్.. బారులుతీరిన జనం.. ఎక్కడంటే

|
Google Oneindia TeluguNews

పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. సెంచరీ మార్క్ ఎప్పుడో దాటేశాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయంపై ఫోకస్ చేశారు. ధర పెరగడమే తప్ప దిగడం లేదు. జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే పెట్రో ధర ఆఫర్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది. అవును జనం ఎగబడుతుంటారు. 50 శాతమో.. 60 శాతం చెబితేనే ఎగబడతారు. మరీ లీటర్ పెట్రోల్ రూపాయికే పోస్తామని చెబితే అంతే.. ఇలాంటి ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Recommended Video

Petrol Rs 1 Per Litre రూపాయికే లీటర్ పెట్రోల్, ఎక్కడంటే ? | Oneindia Telugu

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నేడు.. దానిని పురష్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్ట్రలో గల షోలాపూర్ లో ఓ పెట్రోల్ బంక్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. రూపాయికే లీటర్ పెట్రోల్ అంటూ ప్రకటన ఇచ్చారు. దీంతో అక్కడ క్యూ లైన్ పెరిగింది. వాహనదారులు ఆ పెట్రోల్ బంకు వద్దకు భారీగా తరలివచ్చారు. దాంతో వారందరినీ కట్టడి చేసేందుకు పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది.

bank owner offer to people re.1 litre petrol

రూపాయికే లీటర్ పెట్రోల్ ఆఫర్ ను 500 మందికే అందించారు. దాంతో మిగిలినవాళ్లు నిరుత్సాహంతో వెనుదిరిగారు. దేశంలో పెట్రో ధరలు ఏ రీతిలో పెరుగుతున్నాయో తెలిసిందే. లీటర్ పెట్రోల్ రూ.120 వరకు ఉండటంతో వాహనదారులను సదరు ప్రకటన ఎంతగానో ఊరించింది. కానీ పరిమిత సంఖ్యలో ఇవ్వడంతో తప్ప లేదు. మిగతా జనం మాత్రం ఊసురుమంటూ అక్కడినుంచి వెనుదిరిగారు. అయినప్పటికీ ఆ బాంకు యాజమాని 500 లీటర్లు రూపాయికే కొట్టి.. బాగానే సర్వ్ చేశాడు.

పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్.. బ్యారెల్ ధర... రష్యా-ఉక్రెయిన్ యుద్దం తదితర అంశాల ఆధారంగా పెట్రో మంట కొనసాగుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వరసగా ధరలు పెరుగుతున్నాయి. అంతకుముందు స్థిరంగా ఉండేవి.

English summary
petrol bank owner offer to people re.1 litre fuel. on the special day of ambedkar birth anniversary. incident happened at maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X