3 రోజుల్లో 30 వేల కోట్లు పంపిణీ: అదుర్దా వద్దని వినతి
ముంబై: పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఆదివారం సాయంత్రం పొద్దుపోయేవరకు 30వేల కోట్ల రూపాయలను బ్యాంకులు వినియోగదారులకు అందించాయి. దేశంలోని బ్యాంకుల వ్యవస్థ ప్రజావసరాలకు తగ్గట్టుగా అన్ని విభాగాలను ముమ్మరంగా పనిచేయించడంలో కొన్ని లోటుపాట్లున్నా నగదు పంపిణీ చురుగ్గా సాగిందని భారత బ్యాంకుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నెల 10వ తేదీ నుంచి తగిన గుర్తింపు కార్డుతో నాలుగువేల రూపాయలను పాతనోట్లతో మార్చుకునే అవకాశాన్ని కల్పించిందని, ఈ విధంగా కూడా భారీగానే నగదు పంపిణీ జరిగిందని తెలిపింది. అయితే కేవలం బ్యాంకుల నుంచి తీసుకునే నగదుపైనే ఆధారపడకుండా తమ చెల్లింపులను ఎలాంటి ఇబ్బంది లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసుకోవాలని కోరింది.

బ్యాంకుల వద్ద తగినంత నగదు ఉందని, అందువల్ల జనం ఆదుర్దా పడి పదే పదే బ్యాంకులకు, ఎటిఎంలకు వెళ్లాల్సిన పని లేదని రిజర్వ్ బ్యాంక్ ఆదివారం స్పష్టం చేసింది. ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు, ఎటిఎంల వద్ద జనం రద్దీ తగ్గలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ ప్రకటన చేసింది.
ఆర్‌బిఐ దగ్గర, బ్యాంకుల దగ్గర వంద రూపాయలు, ఇతర చిల్లర నోట్లు చాలినన్ని ఉన్నాయని, జనం ఆదుర్దా చెంది పదే పదే బ్యాంకులకు, ఎటిఎంలకు రావలసిన పనిలేదని, ఎప్పుడు అవసరమైతే అప్పుడే నగదు తీసుకోవచ్చని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications