బైక్ పైన ప్రయాణిస్తూ స్నానం.. ఆపై షాకింగ్ పర్యవసానం!!
పిచ్చి పలు విధాలు అంటారు. కొంతమంది చేసే పిచ్చి చేష్టలు వారికి ఫన్నీగా అనిపించినా, మిగతా వారికి ఇబ్బంది కలిగిస్తాయి. ఫన్ కోసం కొంతమంది చేసే పనులు వారిని అనవసరమైన ఇబ్బందుల్లోకి నెడతాయి. ఇక అటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు యువకులు చేసిన పని వారికి ఫన్ అనిపిస్తే, అది చూసినవారికి మాత్రం ఫ్రస్ట్రేషన్ కలిగించింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువకులు వర్షం పడుతున్న సమయంలో ఒంటికి సబ్బు రాసుకుని బైక్ పై అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ స్నానం చేశారు.

ఈ సంఘటనను అటుగా వెళ్తున్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు దీనిపై రక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ వీడియో ఫన్నీగా ఉంది అంటే, మరికొందరు ఈ వీడియో చిరాకును కలిగిస్తుందని, రోడ్ల మీద బైక్ పై ప్రయాణం చేస్తూ స్నానం చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ బైక్ నెంబర్ యు పి 78 తో మొదలైంది. కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే వీరు ఈ పని చేసినట్టు భావిస్తున్నారు. ఇక ఈ బైక్ కాన్పూర్ కు చెందిన గా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో, ఈ ఘటనపై రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఆ యువకుల కోసం వెతుకుతున్నారు.
బహిరంగ ప్రదేశంలో వాహనదారులకు ఇబ్బందికరంగా ప్రవర్తించిన ఇద్దరి పైన కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు ట్రాఫిక్ డిసిపి రవీనా త్యాగి. రోడ్డుపైన బైక్ పై వెళుతూ స్నానం చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఏది ఏమైనా యువకులు సోషల్ మీడియాలో వైరల్ కావాలని, ఫన్ కోసం చేసిన ఈ వీడియో, ఇప్పుడు వారిని కేసులో ఇరుక్కునేలా చేసింది.












Click it and Unblock the Notifications