• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ తల్లిపై అసభ్య దూషణలు -బీబీసీ షోలో ఓ కాలర్ దుస్సాహసం -సిక్కులపై చర్చలో రైతు ఉద్యమం

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతోన్న నిరసనల వ్యవహారం ఇప్పటికే అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న సిక్కులపై బీజేపీ నేతలు ఖలిస్తానీ ఉగ్రవాదులనే ముద్ర వేయడం, రైతు నిరసనల వెనుక విదేశాల్లోని ఖలిస్తానీ మద్దతుదారుల ప్రమేయం ఉందని కేంద్రం ఆరోపిస్తోన్న క్రమంలో తాజాగా మరో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. సాగు చట్టాల వివాదంలోకి ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని లాగి, ఆమెపై భయానక దూషణలు చేసిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతున్నది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Farmer unions ask people to vote against BJP | Oneindia Telugu

viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్

బీబీసీ రేడియో షోలో..

బీబీసీ రేడియో షోలో..

ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం 'బిగ్ డిబేట్' పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. తాజాగా ఆ షోలో.. యూకేలో సిక్కులు ఇతర భారత సంతతి వారు ఎదుర్కొంటున్న జాత్యహంకార ఉదంతాలపై చర్చ జరిగింది. భారత సంతతికే చెందిన యాంకర్ ప్రియా రాయ్ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు. మూడు గంటలపాటు సాగిన లైవ్ చర్చలో భాగంగా పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ రాగా, వారిలో ఓ కాలర్.. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లి హీరాబెన్ లను బండ బూతులు తిట్టాడు.

మోదీ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు

మోదీ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు

మార్చి 1న లైవ్ లో ప్రసారమైన బీబీసీ రేడియో షోలో 'సిమోన్' పేరుగల ఓ కాలర్.. భారత ప్రధాని తల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమె జననాంగాన్ని కాలితో తొక్కేస్తానంటూ భయానక దూషణలు చేశాడు. ఈ వ్యవహారంపై బ్రిటన్, భారత్ లోని పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమోన్ పేరు గల కాలర్ చేసిన ఉన్మాద వ్యాఖ్యల ఆడియో క్లిప్పు ప్రస్తుతం వైరల్ గా మారింది. కాలర్ కామెంట్లు, యాంకర్ ప్రియా రాయ్ నిస్సహాయతను ప్రశ్నిస్తూ, ఈ ఘటనపై బ్రిటన్ టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ 'ఆఫ్ కామ్' జోక్యం చేసుకోవాలని, సదరు రేడియో ఛానల్ లైసెన్సులను రద్దు చేయాలని భారత సంతతి సంఘాలు, వ్యక్తులు డిమాండ్ చేశారు. కాగా,

viral video:బీజేపీ మంత్రి సెక్స్ వీడియో -కర్ణాటకలో పెను సంచలనం -ఉద్యోగం పేరుతో మహిళను..viral video:బీజేపీ మంత్రి సెక్స్ వీడియో -కర్ణాటకలో పెను సంచలనం -ఉద్యోగం పేరుతో మహిళను..

సారీ.. లైవ్‌లో ఆపలేకపోయాం..

సారీ.. లైవ్‌లో ఆపలేకపోయాం..

రేడియో లైవ్ డిబేట్ లో భారత ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశించి ఓ కాలర్ చేసిన అసభ్యవ్యాఖ్యలపై బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం క్షమాపణలు చెప్పింది. 3 గంటల కార్యక్రమాన్ని 1.32గంటలకు ఎడిట్ చేసి, అందులో యాంకర్ ప్రియా రాయ్ క్షమాపణలను కూడా జతచేశారు. ''ఓక హాట్ టాపిక్ పై చర్చ జరుగుతున్న క్రమంలో కాలర్లు ఉద్వేగంగా మాట్లాడటం అప్పుడప్పుడూ జరుగుతుంది. అది లైవ్ షో కాబట్టి అప్పటికప్పుడే ఆపలేకపోయాం. కాలర్ చేసిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాం''అని యాంకర్ ప్రియా రాయ్ చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై భారత్ వైపు నుంచి అధికారిక స్పందనేదీ వెలువడలేదు.

English summary
An episode of BBC Asian Network’s ‘Big Debate’ radio show has been drawing flak on social media after a speaker on the show spoke impolite words against the mother of Indian Prime Minister Narendra Modi. During the debate which was about racism against Sikhs and Indians in the UK, the discussion veered toward the ongoing farmers protests in Delhi. In course of the show, one of the callers spoke offensive words against PM Modi’s mother, Heeraben Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X