మత్తుపానీయం ఇచ్చి అమ్మాయి నగ్నఫొటోలు తీశాడు: ఆ తర్వాత..

Subscribe to Oneindia Telugu

గుర్గావ్: ఓ అమ్మాయి నగ్న ఫొటోలు తీసి బెదిరింపులకు గురిచేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధానికి సమీపంలోని గుర్గావ్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గుర్గావ్‌లోని సూరత్‌నగర్ కాలనీకి చెందిన అమిత్ కుమార్ (21) బీసీఏ చదువుతున్నాడు. అతడు 22ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా స్నేహం చేస్తూ ఓ రోజు తన ఇంటికి రమ్మని అమ్మాయిని ఆహ్వానించాడు.

BCA student clicks nude pics of FB friend, held

అప్పుడు అమిత్ ఇంట్లో ఎవరూ లేరు. కాగా, ఆ అమ్మాయి ఇంటికి రాగానే ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింకు ఇచ్చాడు. ఆ పానీయాన్ని తాగిన అమ్మాయి మత్తులోకి జారుకుంది. వెంటనే అమిత్.. తన సెల్ ఫోన్ ద్వారా అమ్మాయి నగ్న చిత్రాలు తీశాడు. గంట సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన అమ్మాయి.. అమిత్ అసభ్యంగా ప్రవర్తిస్తుండటం గుర్తించింది.

ఇందుకు అమ్మాయి అడ్డుచెప్పటంతో తాను నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఇంటికి వెళ్ళిన బాధితురాలు.. విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. కాగా, తమ కూతురును తీసుకుని పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్‌పై ఐపీసీ సెక్షన్ 354, 506ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 21-year-old BCA student has been arrested for allegedly taking nude photos of a woman he had met on Facebook.and befriended after spiking her drink with sedatives when she visited his home on Tuesday.
Please Wait while comments are loading...