ఢిల్లీ తరహాలో.. జూలో వ్యక్తిపై దాడి చేసి తినేసిన ఎలుగుబంటి
రాయ్‌పూర్: ఢిల్లీలోని జూలో ఓ యువకుడిని చిరుతపులి చంపేసిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జూలో సోమవారం ఓ ఎలుగుబంటి యువకుడిని చంపేసింది. జూలో ఉన్న ఎలుగుబంటి ఆ యువకుడిపై హఠాత్తుగా దాడిచేసింది. అందరూ చూస్తుండగానే సజీవంగా అతడ్ని తినేసింది.
కాగా, ఘటన అనంతరం ఆ ఎలుగుబంటిని కాల్చి చంపినట్లు తెలిపారు. ఎలుగుబంటి హఠాత్తుగా దాడి చేయడంతో ఆ వ్యక్తి సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దీంతో సమీపంలో ఉన్న వ్యక్తులు ఆ ఎలుగుబంటిపై రాళ్లు మొత్తడం ప్రారంభించారు. అయినా ఆ ఎలుగుబంటి అతడ్ని లాక్కుని వెళ్లి తీవ్రంగా గాయపర్చింది. అతడు ప్రాణాలతో ఉండగానే తినేసింది.

ఆ ఎలుగుబంటి గతంలో కూడా ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ రైతును, మరో వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేసినట్లు చెప్పారు. వారిద్దరూ ఎలుగుబంటితో పోరాడేందుకు ప్రయత్నించినా.. ఆ ఎలుగుబంటి వారిని తీవ్రంగా గాయపర్చి చంపేసిందని తెలిపారు.
ఆ ఎలుగుబంటి వ్యక్తులను చంపేసిన తర్వాత కొన్ని భాగాలను తినేసిందని అధికారులు చెప్పారు. తాజా ఘటనతో ముగ్గురి మరణానికి కారణమైన ఆ ఎలుగుబంటిని పోలీసులు కాల్చి చంపారని అధికారులు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications