మరో రెండు శవాలు లభ్యం: అధికారులకు క్లీన్‌చిట్
షిమ్లా: పండో డ్యామ్ వద్ద మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు మందగించాయి. ఈ గాలింపు చర్యల్లో మరో రెండు మృతదేహాలను వెలికీ తీశారు. దీంతో ఇప్పటి వరకు 10 మృతదేహాలను వెలికి తీసినట్లయింది. మరో 14 మంది జాడ తెలియాల్సి ఉంది. ఒక మృతదేహం హైదరాబాద్ విద్యార్థి తరుణ్‌దిగా గుర్తించారు. తరుణ్ మృతదేహాన్ని రేపు గురువారం హైదరాబాద్ తరలిస్తారు. మరో మృతదేహం స్థానిక వ్యక్తిదని అంటున్నారు.
ఇదిలావుంటే, విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతై 11 రోజులు గడుస్తోంది. ఈ స్థితిలో లార్జీ హైడ్రో పవర్ ప్రాజెక్టు అధికారులకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డు నిర్వహించిన అంతర్గత విచారణ క్లీన్ చిట్ ఇంచ్చింది. హెచ్చరికలు లేకుండా ఎక్కువ నీటిని విడుదల చేయడం వల్లనే విద్యార్థులు కొట్టుకుపోయారనే ఆరోపణలు వచ్చాయి.
లార్జీ డ్యామ్ నుంచి నీరు వదలడంతో జూన్ 8వ తేదీన 24 మంది హైదరాబాద్ ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయారు. ప్రాజెక్టు స్థలం వద్ద లభ్యమైన రికార్డుల ఆధారంగా, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా, లార్జీ డ్యామ్ ఉద్యోగులూ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ జరిగింది.

జూన్ 8వ తేదీన తెల్లవారు జామున ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు దశలవారీగా 2820 క్యూమెక్స్ నీరు విడుదల చేసినట్లు నలుగురు సభ్యుల విచారణ కమిటీ తేల్చింది. 100 మెగావాట్ల కర్చం వాంగ్టూ, 1500 మెగావాట్ల ఎన్‌జెపిపిసి, 192 అలైన్ అండ్ దుహంగన్, మలానా, ఇతర స్వతంత్ర విద్యుచ్ఛక్తి ఉత్పత్తిరదారులు స్థాపిత సామర్థ్యం కన్నా 10 - 15 శాతం అదనంగా నడపడానికి అనుతించారనే ప్రశ్నకు విచారణ కమిటీ సమాధానం చెప్పలేదు.
నీటిని 29 దశల్లో విడుదల చేసినట్లు విచారణ కమిటీ తెలిపింది. లార్జీ డ్యామ్ నుంచి అకస్మాత్తుగా నీరు వదలిపెట్టలేదని, జూన్ 8వ తేదీ తెల్లవారు జామున ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు నీరు వదిలారని, ఏడున్నర గంటలకు వదిలిన నీటిలో విద్యార్థులు కొట్టుకుపోయారని విచారణ కమిటీల చెప్పారు.












Click it and Unblock the Notifications