బియాస్ ట్రాజెడీ: విద్యార్థి జగదీష్ మృతదేహం లభ్యం
మండి: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గురువారం మరో విద్యార్థి మృత దేహాన్ని సహాయక బృందాలు వెలికి తీశాయి. మృతుడ్ని హైదరాబాద్‌కు చెందిన జగదీష్‌గా గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు విహార యాత్రకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఈనెల 8వ తేదీన బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు 19 మృత దేహాలు వెలికితీశారు. మరో ఐదు విద్యార్థుల మృత దేహాలు లభ్యం కావలిసి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు, సహాయక బృందాలు తెలిపాయి. ఇటీవల నాలుగు మృతదేహాలను వెలికి తీసిన విషయం తెలిసిందే.

ఈ నెల 8న నగర శివారుల్లోని బాచుపల్లికి చెందిన విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు స్టడీ టూర్ కోసం ఉత్తరప్రదేశ్‌లోని బియాన్ నదికి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రమాదవశాత్తూ డార్జీ డ్యాం నుంచి అక్కడి అధికారులు నీటి ని వదలడంతో ఫోటోల కోసం నదిలోకి దిగిన విద్యార్థులు ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృ తికి 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంతో చర్చించి సహాయక చర్యలను తక్షణమే చేపట్టేలా చేశాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులను కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications