బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bed scam: అవును ఆ ముగ్గురికి సంబంధం ఉంది, పరుపుల బిజినెస్ లో ఆంటీ A1, మొత్తం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఉద్దరగా డబ్బులు సంపాధించాలి అని అతితెలివితో బెంగళూరులో ముగ్గురు అరెస్టు అయ్యి జైలుపాలైనారు. డబ్బులు సంపాధించడానికి వేరే మార్గాలు ఉన్నా కోవిడ్ రోగును టార్గెట్ చేసుకుని పరుపుల బిజినెస్ చేస్తూ ఇప్పటికే సమాజసేవకురాలిని, ఆమె అసిస్టెంట్ ను అరెస్టు చేశారు. మహిళకు ఐసీయూలో బెడ్ ఇప్పించడానికి ఏకంగా లక్షలు వసూలు చేసిన మరో ముగ్గురు కాలాంతకులను పోలీసులు అరెస్టు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వెంట తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు కేసు విచారణ చేసి దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకువచ్చారు.

Khiladi girls: ఇంట్లో దూరి ప్యాంట్ విప్పించి..... ? వీడియో తీసి, ఒకేసారి ముగ్గురు, రూ. 5 లక్షలు !Khiladi girls: ఇంట్లో దూరి ప్యాంట్ విప్పించి..... ? వీడియో తీసి, ఒకేసారి ముగ్గురు, రూ. 5 లక్షలు !

సమాజసేవకురాలి ముసుగులో ?

సమాజసేవకురాలి ముసుగులో ?

సమాజ సేవకురాలి ముసుగులో కోవిడ్ రోగులను టార్గెట్ చేసుకుని ఒక్కొక్క బెడ్ రూ. 50 వేలుకు విక్రయిస్తున్న నేత్రావతి అలియాస్ నేత్రా, ఆమె అనుచరుడు రోహిత్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ దెబ్బతో బెంగళూరులో బెడ్ బ్లాకింగ్ దందా వెలుగు చూడటంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. అధికార పార్టీ నాయకులే పరుపుల స్కామ్ పై ప్రభుత్వ అధికారుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు

అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు

బెంగళూరులోని బోమ్మనహళ్ళి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి వెనుక తిరుగుతున్న బాబు అనే వ్యక్తి కూడా ఈ బెడ్ బ్లాకింగ్ దందాలో పోలీసులకు చిక్కిపోయాడు. బాబును అరెస్టు చేసిన పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. అంతకు ముందు పరుపుల బిజినెస్ స్కామ్ లో అరెస్టు అయిన నేత్రావతి, ఆమె అనుచరుడు రోహిత్ కు బాబుకు లింక్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కోర్టులో చార్జ్ షీట్

కోర్టులో చార్జ్ షీట్

బెడ్ బ్లాకింగ్ స్కామ్ కేసు బెంగళూరు సీసీబీ పోలీసులు దర్యాప్తు చేశారు. కేసు విచారణ పూర్తి చేసిన సీసీబీ విభాగం డీఎస్పీ శ్రీధర్ పూజర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్ బెంగళూరులోని 1వ ఏసీఎంఎం న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. నేత్రవాతి, రోహిత్, బాబు అమాయకులైన రోగుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి కోవిడ్ చికిత్స కోసం బెడ్ లు కేటాయించారని వెలుగు చూసిందని, వీరికి ఈ స్కామ్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని చార్జ్ షీట్ లో వివరాలు పొందుపరిచారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. మొత్తం మీద బెంగళూరు బెడ్ బ్లాకింగ్ కేసులో ముగ్గురు నేరం చేశారని వివరాలు నమోదు చేశారని సమాచారం.

English summary
Bed scam: Bengaluru CCB police have filed chargsheet against the three accused in connection with the covid-19 bed blocking case .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X