సీఎంకు షాక్ ఇచ్చిన మేయర్. రాష్ట్రంలోనే తక్కువ వయసు లేడీ మేయర్, పోస్టు బాక్స్ లో ?
బెంగళూరు: బళ్లారి సిటీ కార్పొరేషన్ చరిత్రలో తొలిసారిగా అతి చిన్న వయసులో మేయర్ పదవిని దక్కించుకున్న డి. త్రివేణి సూరి అలియాస్ త్రివేణి చాలా సైలెంట్ గా రాజీనామా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో అతి చిన్న వయసులో మేయర్‌గా పనిచేసిన త్రివేణి నవంబర్ 4వన తన ఆమె మేయర్ పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా పత్రాన్ని సంబంధిత అధికారులకు కాని, డిప్యూటీ మేయర్ కాని ఇవ్వకుండా త్రివేణి అందరికి షాక్ ఇచ్చారు.
బళ్లారి మేయర్ త్రివేణి తన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి తపాలా (పోస్టులో) పంపించడం ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. రాజీనామాలు చేసిన నాయకులు. మేయర్లు, కార్పోరేటర్లు సాధారణంగా పార్టీ అధ్యక్షులకు లేదా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారికి సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంటుంది. అయితే బళ్లారి మేయర్ త్రివేణి ఆమె రాజీనామా లేఖ పోస్టులో పంపించడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బళ్లారి మేయర్ త్రివేణి ఎందుకు రాజీనామా చేశారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం మాత్రం చిక్కలేదు. బళ్లారి సిటీ మేయర్ పదవికి ఉమాదేవి, కుబేర అనే ఇద్దరితో త్రివేణికి గట్టి పోటీ ఎదురైయ్యింది. అయితే అతి తక్కువ వయసులో త్రివేణి బళ్లారి మేయర్ గా ఎంపికయ్యారు. తరువాత పార్టీలో గొడవలు రాకూడదని, తిరుగుబాటు రాకూడదని బళ్లారి మేయర్ త్రివేణిని శాంతింపజేసేందుకు ఆరు నెలల మాత్రమే ఆమె పదవిలో ఉండాలని, తరువాత ఆమె రాజీనామా చెయ్యాలని షరతులు పెట్టి ఆమెకు మేయర్ పదవిని కట్టబెట్టారని అంటున్నారు.
ఆరు నెలలు పూర్తయిన తర్వాత త్రివేణిని మేయర్ పదవి నుంచి తప్పించడానికి పార్టీ నాయకులతో పాటు కార్పోరేటర్లు సైతం అంగీకరించలేదు. వేరే మేయర్ కుబదులు త్రివేణిని బళ్లారి మేయర్ గా కొనసాగించాలని పలువురు కార్పోరేటర్లు, పార్టీ నాయకులు ఇటీవల అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బళ్లారి మేయర్ త్రివేణి రాజీనామా చేయాలని కొందరు మాత్రమే డిమాండ్ చేశారు. దీంతో ఈ ఒత్తిళ్లతో విసిగి వేసారిపోయిన త్రివేణి ఎవ్వరికీ తెలీకుండా సైలెంట్ గా రాజీనామా చేసి ఆమె రాజీనామా లేఖను పోస్టులో బళ్లారి కార్పోరేషన్ కమీషనర్ కు పంపించేశారు.

త్రివేణి మేయర్ పదవికి రాజీనామా చెయ్యడంతో ఇప్పుడు బళ్లారి మేయర్ పదవి ఖాళీ అయ్యింది. నవంబర్ 28వ తేదీన బళ్లారి సిటీ కార్పోరేషన్ కు కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆదేశించారు. సీఆర్‌పీసీ చట్టం 1973లోని సెక్షన్ 144 ద్వారా కల్పించిన అధికారాలను వినియోగించుకుని ఎన్నికల రోజున ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications