వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జుబెర్, తీస్తా అరెస్టులు ఎందుకు..? మోడీ సర్కార్‌పై శివాలెత్తిన దీదీ

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఫైరయ్యారు. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబెయిర్‌ అరెస్టు చేయడంపై మండిపడ్డారు. బీజేపీ సామాజిక మాధ్యమాలు బూటకపు వీడియోలు, తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేసేవేనని మండిపడ్డారు. మీ నేతలు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసినపుడు మాత్రం ఏమీ చేయరని ఫైరయ్యారు. జుబెయిర్‌ను ఎందుకు అరెస్టు చేశారు? ఆయన ఏం చేశారు? తీస్తా సెతల్వాద్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఆమె ఏం చేశారు? యావత్ ప్రపంచం దీనిని ఖండిస్తోందని మమత అన్నారు.

రిమాండ్‌లో..

రిమాండ్‌లో..

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబెయిర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు ఒక రోజు రిమాండ్ విధించింది. మతపరమైన మనోభావాలను గాయపరిచారని ఆరోపిస్తూ భారత శిక్షా స్మృతిలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు.

హైకోర్టు స్టే

హైకోర్టు స్టే


ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ ఆల్ట్‌ న్యూస్‌ కో ఫౌండర్ మహ్మద్ జుబెర్‌ను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. జుబైర్‌ అరెస్ట్‌ను ఆల్ట్‌ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా ధ్రువీకరించారు. 2020 నాటి కేసుకు సంబంధించి జుబైర్‌ను దిల్లీ పోలీసులు ప్రశ్నించడానికి పిలిచారు. ఈ కేసు విషయంలో ఎలాంటి అరెస్టు చేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆల్ట్‌న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ట్వీట్ చేశారు.

తప్పుడు సాక్ష్యాలట..?

తప్పుడు సాక్ష్యాలట..?


2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారని ఆరోపిస్తూ నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌లను అరెస్టు చేశారు. గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో అరెస్టులు జరిగాయి.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee attacked the BJP over the recent arrests of Alt News co-founder Mohammed Zubair and Mumbai-based social activist Teesta Setalvad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X