వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ డబ్బు అవసరం లేదు... విగ్రహాన్ని మేమే నిర్మించుకుంటాం : దీదీ అటాక్

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా అల్లర్లు మరోసారి ప్రధాని మోడీ, మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యల మాటల యుద్దానికి తెరలేపింది. నువ్వేంతంటే నువ్వేంత అనే స్థాయిలో ఇద్దిర మధ్య వాదనలు కొనసాగుతన్నాయి..ఈ నేఫథ్యంలోనే కోల్‌కతాలోని బీజేపీ అధ్యక్షుడు పాల్గోన్న ర్యాలీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే . ఈ అల్లర్లలో రెండు వర్గాల మధ్య రాళ్లు రువ్వుకున్నారు. కొన్ని మోటారు సైకిళ్లు అగ్నికి ఆహూతయ్యాయి. దీంతోపాటు ఆ అల్లర్లలో సంఘ సంస్కర్త అయిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం అయింది.

అయితే విగ్రహం ధ్వంసం అయిన నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. విగ్రహం ధ్వంసం అయిన స్థానంలో ఆయన విగ్రహాన్ని పంచలోహలతో అతిపెద్ద విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. అల్లర్లకు పాల్పడ్డవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగ ఈ హింసకు మమతా బెనర్జీయో కారణమని ఆయన ఆరోపించారు.కాగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆశయాలకు తాము కట్టుపడి ఉన్నట్టు మోడీ గురువారం ఉదయం ప్రకటించారు..

Bengal has enough to rebuild Vidyasagar statue: Mamata Banerjee

దీంతో మమత బెనర్జీ ప్రధాని ప్రటకనను తోసిపుచ్చారు. విగ్రహ పునర్మీణానికి బీజేపీ డబ్బు అవసరం లేదని ఆమే అన్నారు. బెంగాల్ ప్రభుత్వమే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పునర్మీస్తామని స్పష్టం చేశారు. బెంగాల్ వద్ద డబ్బు ఉందని మోడీ డబ్బులు అవసరం లేదని ఆమే ఎన్నికల ర్యాలిలో స్పష్టం చేశారు.

English summary
West Bengal chief minister Mamata Banerjee said on Thursday .Bengal does not need money from the BJP, it has enough resou resources to rebuild the Vidyasagar statue that was vandalised at a Kolkata college following Amit Shah's roadshow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X