వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ మంత్రిపై బాంబు దాడి, మరో ఇద్దరికీ గాయాలు.. మినిష్టర్ పరిస్థితి క్రిటికల్..

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్ మంత్రిపై బాంబు దాడి జరిగింది. ముర్షిదాబాద్ జిల్లా నిమిత్తి రైల్వేస్టేషన్ వద్ద దుండగులు నాటుబాంబుతో దాడి చేశారు. దాడిలో కార్మికశాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే జంగీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

బాంబు దాడిలో మంత్రితోపాటు మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. వారిలో ఒకరు ఆయన మేనల్లుడు ఉన్నారు. రైలులో కోల్ కతా వెళ్లడానికి బుధవారం రాత్రి 10 గంటలకు నిమిత్తా రైల్వేస్టేషన్ వచ్చారు. రైలు కోసం ప్లాట్ పామ్ నంబర్ 2 వద్ద వేచి చూస్తుండగా దాడి జరిగింది. ఇదీ సుతి పోలీస్ స్టేషన్ ఏరియా కిందకి వస్తోంది. దుండగులు ఒక్కసారిగా బాంబు విసిరారని స్థానికులు తెలిపారు.

Bengal minister Jakir Hossain injured in bomb attack

బాంబు దాడి ఘటనతో పోలీసుల అక్కడికి చేరేకున్నారు. దుండగులను కనిపెట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మరికొద్దిరోజుల్లో బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది.

English summary
West Bengal minister Jakir Hossain was seriously injured on Wednesday after unidentified miscreants hurled bombs at him, police informed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X