Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

escape: పోలీసులతో పెట్టుకుంటే ఏమౌతుందో చూపించేశారు, దెబ్బకు ??

బెంగళూరు: కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని నగరంలోని రింగ్‌రోడ్డు అలంద చెక్‌పోస్టు సమీపంలోని యునాని ఆసుపత్రి సమీపంలో పోలీసులపై తుపాకీతో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. చన్నవీర నగర్‌కు చెందిన మంజునాథ్‌ స్వామి(29) అనే నిందితుడి మీద పోలీసులు కాల్పులు జరిపారు.

నిందితుడు దాడి చేసిన సమయంలో చెక్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సిద్దరమేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని, ఆయనకు చికిత్స చేయించడానికి యునైటెడ్ ఆసుపత్రిలో చేర్చామని పోలీసు అధికారులు తెలిపారు.

Bengaluru: Accused of murder tried to escape, escape from arrest. What happened to the accused in the police firing?

రింగ్‌రోడ్డులోని భవానీనగర్‌లో బుధవారం మధ్యాహ్నం చన్నవీరనగర్‌కు చెందిన ప్రశాంత కుంబార(30) అనే యువకుడిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.

పాత కక్షల నేపథ్యంలో, ప్రశాంత్ కు అక్రమ సంబంధం కారణ:గా హత్య జరిగిందని పోలీసు అధికారులు అన్నారు. ప్రశాంత్ ను హత్య చేసిన తరువాత తల దాచుకున్న మంజునాథస్వామి కోసం పోలీసులు గాలించారు. ప్రశాంత్ హత్య కేసులో నిందితుడైన మంజునాథ్‌ స్వామిని గురువారం ఉదయం అరెస్టు చేశారు.

అనంతరం భవానీనగర్‌లో హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి పంచనామా చేశారు.

హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, దుస్తులను దాచిన ప్రదేశానికి మంజునాథ్ స్వామిని తీసుకెళ్లారు. యునాని ఆసుపత్రికి సమీపంలోని ఓ స్థలంలో దాచి ఉంచినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. అక్కడికి వెళ్లగానే అక్కడ ఉంచిన తుపాకీతో పోలీసు సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుంచి తప్పిపంచుకోవడానికి ప్రయత్నించాడు. ఓపిక నసించిపోయిన పోలీసులు నిందితుడు మంజునాథ్ స్వామి మీద కాల్పులు జరపడంతో అతను కుప్పకూలిపోయాడు, మంజునాథస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+