Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆన్ లైన్ ఉద్యోగాలు, ఐదు నెలల్లో రూ 40 కోట్లు వసూలు, ఐటీ హబ్ గ్యాంగ్ గోల్ మాల్, దుబాయ్ లో ?

ఇంటి దగ్గర, సొంత ఊర్లలో ఉంటూ ఆన్ లైన్ ఉద్యోగాలు చెయ్యాలని చాలా మంది యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారిని ఓ ముఠా టార్గెట్ చేసింది. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ 40 కోట్లకు పైగా ప్రజల నుంచి వసూలు చేసి వారిని మోసం చేసిన నలుగురు కిలాడీ కేటుగాళ్లను బెంగళూరులోని ఈశాన్య డివిజన్‌ సీఈఎన్ పోలీస్ స్టేషన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌కు చెందిన సయ్యద్ యూనస్ ఫాజిల్ అలియాస్ ముదాసిర్, భారతీనగర్‌కు చెందిన మహ్మద్ కలీముల్లా, బనశంకరి సమీపంలోని కావేరీనగర్‌కు చెందిన సయ్యద్ అర్బాజ్, ఫ్రేజర్ టౌన్‌కు చెందిన ఇబ్రహీం కర్నూల్‌ అనే నిందితులను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ. 60 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.

Bengaluru gang who cheated people by offering them online jobs and collected Rs 40 crores

ప్రజలను మోసం చెయ్యడానికి ఉపయోగించిన వివిధ కంపెనీల మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పలు కంపెనీల పేరుతో తయారు చేసిన రబ్బర్ స్టాంప్స్, సీల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న హుస్సేన్‌, మోయిన్‌ల కోసం గాలిస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. గత సెప్టెంబరులో పూజా సావంత్ అనే యువతి తనకు ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తామని నమ్మించి రూ 88 వేలు వసూలు చేసి మోసం చేశారని బెంగళూరు నార్త్ ఈస్ట్ డివిజన్‌లోని సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు రంగంలోకి దిగి విచారణ చేశారు. పూజా సావంత్ ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలతో కిలాడీ కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చి మోసం చేశారని పోలీసు అధికారులు అన్నారు. వీళ్ల మాటలు నమ్మిన వ్యక్తుల నుంచి వివిధ కంపెనీల పేరుతో డబ్బును పెట్టుబడిగా పెట్టారు.

ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని చెప్పి నిందితులు డబ్బులు వసూలు చేశారని పోలీసులు అన్నారు. అలాగే పలు కంపెనీలకు సంబంధించిన వివిద రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ఇంకా లాభం వస్తుందని నమ్మించి డబ్బులు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు 304 మందిని ఇలాగే మోసం చేసి రూ 40 కోట్లు లూటీ చేశారని పోలీసుల విచారణలో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు.

Bengaluru gang who cheated people by offering them online jobs and collected Rs 40 crores
నకిలీ పత్రాలు ఇచ్చి బ్యాంకు ఖాతాలు సృష్టించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.నిందితులు ఆన్‌లైన్‌లో మోసం చేసి సంపాదించిన సొమ్మును ఇతరుల పేరుతో కరెంట్ ఖాతాలు తెరిచారు. ఇందుకోసం యూనస్, కలీముల్లా, అర్బాజ్ దుకాణాలు అద్దెకు తీసుకుని నకిలీ కాంట్రాక్టులు సృష్టించి వివిధ కంపెనీల పేర్లతో బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ లు ప్రారంభించారు.

ఫ్రేజర్ టౌన్‌లోని మొబైల్ షాపు యజమాని ఇబ్రహీం ఈ బ్యాంకు ఖాతాలకు మొబైల్ నంబర్‌లను లింక్ చేయడానికి అవసరమైన సిమ్‌లను సరఫరా చేస్తున్నాడు. నిందితుల నుంచి ఎలాంటి పత్రాలు తీసుకోకుండా సామాన్య ప్రజలు ఇచ్చిన డాక్యుమెంట్లను వాటికి జతచేసి సిమ్ కార్డులు సేకరించి అతని అనుచరులకు ఇచ్చాడని, నిందితులు అన్ని నకిలి డాక్యూమెట్లతో సిమ్ కార్డులు తీసుకున్నారని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

Bengaluru gang who cheated people by offering them online jobs and collected Rs 40 crores
మహారాష్ట్రలోని ముంబాయికి చెందిన హుస్సేన్ ఈ దందాలకు కింగ్‌పిన్ అని, అతను దుబాయ్‌లో కూర్చుని సైబర్ మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. హుస్సేన్ తన సహచరుడు మోహిన్ ద్వారా ఇతర నిందితులను పరిచయం చేసుకున్నాడు. హుస్సేన్ బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఒక్కో ఖాతాకు రూ 75, 000, ప్రతి సిమ్ కార్డుకు రూ 500 చొప్పున నిందితులకు చెల్లించేవాడని, నెలకు ఒకసారి దుబాయ్ నుంచి బెంగళూరు సిటీకి వచ్చి బ్యాంకు వివరాలు, వాటిలో ఉన్న నగదు వివరాలు సేకరించి తిరిగి దుబాయ్ వెళ్లిపోతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

నిందితులు వివిద బ్యాంకులకు సంబంధించిన 26 ఖాతాల ద్వారా రూ 40 కోట్లు కు పైగా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితుల నుంచి 30 బ్యాంకు ఖాతాల వివరాలను రాబట్టగా అందులో 26 ఖాతాల్లోకి రూ 40 కోట్లు బదిలీ చేశారని, ఇతర ఖాతాలను పరిశీలిస్తే ఇంకా వీళ్ల మోసాలు ఎక్కువగా వెలుగు చూసే అవకాశం ఉందని, కేవలం ఐదు నెలల కాలంలోనే నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారని బెంగళూరు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+