దేశంలో తొలి కరోనా మరణం ఈ రాష్ట్రంలోనే!: 62కు చేరిన కరోనా బాధితులు
బెంగళూరు: మనదేశంలోనూ కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సౌదీ నుంచి వ్యక్తికి కరోనా..
తాజాగా కర్ణాటకలో ఓ కరోనా అనుమానిత రోగి మృతి చెందినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ(76) ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చాడు. ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం కలబుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు.

కరోనా తొలి మరణం...
కాగా, మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీలో కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో.. వైద్యులు అతడి రక్త నమునాలను పరీక్షల నిమిత్తం బెంగళూరులోని ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అయితే, ఈ లోగానే సిద్దిఖీ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, సిద్దిఖీ కరోనా కారణాంగానే చనిపోయారా లేదా అన్నది రిపోర్టులు వచ్చాకే తెలుస్తుందిన వైద్యులు వెల్లడించారు. కరోనా లక్షణాలతోనే ఈయన మృతి చెందినట్లయితే.. దేశంలో నమోదైన కరోనా తొలి మరణంగా నిలుస్తుంది.
Recommended Video


62కు చేరిన కరోనా బాధితులు
ఇది ఇలావుండగా, కరోనావైరస్ కేసుల సంఖ్య 62కి చేరింది. వీరిలో 16 మంది ఇటాలియన్లు ఉండగా, మిగితా వారంతా భారతీయులు. కరోనావైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. కరోనా అనుమానితులకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన తర్వాతే వైరస్‌ను నిర్ధారిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దేశంలో కరోనావైరస్ వ్యాపిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రాలకు కావాల్సిన సహాయ సహాకారాలను అందిస్తున్నారు. కాగా, కేరళ, మహారాష్ట్రలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications