• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్టడీ: ఏ రంగాల్లో వేతనాలు ఎక్కువ అంటే, అత్యధిక వేతనాల్లో బెంగళూరు ఫస్ట్, నాలుగో స్థానంలో హైదరాబాద్

|

బెంగళూరు/న్యూఢిల్లీ: భారతదేశంలో ఎక్కువ వేతనాలు ఉన్న రంగాలు.. హార్డ్‌వేర్ అండ్ నెట్ వర్కింగ్, సాఫ్టువేర్ అండ్ ఐటీ సర్వీసెస్, కన్స్యూమర్ సెక్టార్‌లని లింక్డిన్ వెల్లడించింది. డాటా ప్రకారం దేశంలో తొలిసారి ఉద్యోగాలు, వేతనాలపై స్టడీ చేశారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

టెక్నాలజీ ఇండస్ట్రీలో దేశంలోని నగరాల్లో బెంగళూరులో ఎక్కువ వేతనాలు ఉన్నాయి. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ ఉంది. హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ ఉద్యోగులకు ఏడాదికి రూ.15 లక్షల వరకు వస్తున్నాయి. సాఫ్టువేర్ ఉధ్యోగులకు దాదాపు రూ.12 లక్షలు, కన్స్యూమర్ రంగంలో దాదాపు రూ.9 లక్షలు వస్తున్నాయి.

Bengaluru pays the highest salaries in India: Study

సరాసరిగా చూస్తే ఉద్యోగులు ఏడాదికి బెంగళూరులో ఏడాదికి రూ.11,67,337, ముంబై రూ.9,03,929, ఢిల్లీ -ఎన్సీఆర్ - రూ.8,99,486, హైదరాబాద్ రూ.8,45,574, చెన్నై రూ.6,30,920 వేతనాలు పొందుతున్నట్లు లింక్డిన్ స్టడీలో తేలింది.

భారతదేశంలో ఎక్కువ వేతనాలు ఇస్తున్న సెక్టార్ల విషయానికి వస్తే.. హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ రూ.14,72,671, సాఫ్టువేర్ అండ్ ఐటీ సర్వీసెస్ రూ.12,05,341, కన్స్యూమర్ గూడ్స్ రూ.9,95,161, హెల్త్ కేర్ రూ.9,59,789, ఫైనాన్స్ రూ.9,47,339, కార్పోరేట్ సర్వీసెస్ రూ.9,37,583, నిర్మాణరంగం రూ.8,30,285, మాన్యూఫ్యాక్చరింగ్ రూ.8,14,588, రియల్ ఎస్టేట్ 7,82,871, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ 7,15,148.

హయ్యెస్ట్ పేయింగ్ టైటిల్స్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ సేల్స్, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్.

హార్డ్ వేర్ ఇంజనీర్లు ఎక్కువ వేతనాలు పొందుతున్నారు. పెద్ద ఎత్తున చిప్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ భారత్‌కు తరలివచ్చిందని, దీంతో వేతనాలు బాగా వస్తున్నాయని సెమీకండక్టర్ టూల్స్ కంపెనీ సినోప్సిస్ ఇండియా డిజైన్ ఆర్‌డీ హెడ్ శివానంద కోటేశ్వర్ చెప్పారు.

లింక్డిన్ భారతదేశంలో తన సాలరీ ఇన్‌సైట్ టూల్‌ను ప్రారంభించింది. 50 మిలియన్లకు పైగా యూజర్స్ ఉన్నారు. అమెరికా తర్వాత ఇది సెకండ్ హయ్యెస్ట్. లింక్డిన్ గత రెండు నెలలుగా ఈ డాటాను సేకరిస్తోంది.

సిస్కో సీఐవో (ఇంటర్నేషనల్) వీసీ గోపాలరత్నం నెట్ వర్కింగ్ గురించి చెబుతూ.. మార్పుల సుడిగుండంలో ఉందని, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ యొక్క పునాదిని రూపొందిస్తుందని తెలిపారు.

కొత్త కొత్త డిజిటల్ టెక్నాలజీలు వేతనాలు పెంచే విధంగా పుట్టుకు వస్తున్నాయి. ఏఐ, మిచన్ లర్నింగ్‌లలో వేతనాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రోగ్రామ్స్ పైన అంతగా పట్టు లేకపోయినప్పటికీ, డొమైన్ గురించి అవగాహన కలిగి ఉన్న బైలింగువల్ ప్రోగ్రామర్స్‌కు కూడా మంచి వేతనాలు వస్తున్నాయని జులియా కంప్యూటింగ్ కో ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విరాల్ షా తెలిపారు. డొమైన్ నిపుణులు బిజినెస్, ఇంజినీరింగ్, ఫైనాన్స్, సైంటిఫిక్, మెడికల్.. ఇలా ఏ రంగంలో ఉన్నా వేతనాలు బాగుంటాయని చెప్పారు. ఉదాహరణకు బయోమెడికల్ ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఏఐ ప్రోగ్రామర్ నెక్స్ట్ జనరేషన్ మెడికల్ డివైస్‌లను బిల్డ్ చేయగలడని చెప్పారు.

లింక్డిన్ శాలరీ అంశాలు భారతదేశంలోని జాబ్ మార్కెట్లో పోటీ కారణంగా వేతనాల్లో పారదర్శకతను తీసుకు వస్తాయని, ఇప్పుడు కంపెనీలు వేతనాలు ఎలా ఇస్తున్నాయనే నమ్మకమైన డాటాతో స్పష్టత ఇస్తుందని లింక్డిన్ ఇండియా ప్రోడక్ట్స్ హెడ్ అజయ్ దత్తా తెలిపారు. ఎలాంటి ప్యాకేజీలు ఆశిస్తున్నారు, ఆయా ఇండస్ట్రీలు, ఆయా విద్యార్హతలకు ఏయే కంపెనీల్లో ఏ రకంగా వేతనాలు మారుతున్నాయో తెలుసుకుంటారని చెప్పారు.

English summary
LinkedIn study finds that by city, Bengaluru pays the best salaries, followed by Mumbai, Delhi-NCR and Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X