బెంగళూరులో షహనాజ్ కిడ్నాపర్ల ముఠాపై కాల్పులు, పోలీసు మీద దాడికి యత్నం !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా సభ్యులు మీద బెంగళూరు పోలీసులు తూటాల వర్షం కురిపించారు. కిడ్నాపర్లను పట్టుకునే సమయంలో పోలీసుల మీద దాడి చెయ్యడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకులకు పని చెప్పారు.

బెంగళూరు నగరంలోని కొత్తనూరు సమీపంలో అభిరామ్ (3) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన అభిరామ్ అనే బాలుడిని షహనాజ్ ఖానమ్ అనే నిందితురాలి దగ్గరకు ఇచ్చారు. బాలుడిని విక్రయించడానికి బేరం పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అభిరామ్ కోసం గాలించారు.

గురువారం పోలీసులు నిందితురాలు షహనాజ్ ను గుర్తించి అరెస్టు చేసి అభిరామ్ ను క్షేమంగా రక్షించారు. నిందితురాలు షహనాజ్ ఇచ్చిన సమాచారం మేరకు కిడ్నాపర్లు నురుల్లా, ఐజాక్ ఖాన్, వాహిద్ ల కోసం పోలీసులు గాలించారు. శుక్రవారం వేకువ జామున 5.30 గంటల సమయంలో కిడ్నాపర్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు.

Bengaluru police have started firing on 3 kidnappers

ఆ సందర్బంలో పోలీసుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. నూరుల్లా కాలిలో బుల్లెట్లు దూసుకుపోవడంతో నిందితులు లొంగిపోయారని పోలీసులు అన్నారు. నూరుల్లాను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police have started firing on 3 kidnappers in this morning, who have kidnapped a 3 year boy in Kotnoor, in Bengaluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి